Citroen Basalt Price Hike 2025: ఇటీవలి సంవత్సరాలలో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించిన కొత్త కార్ల తయారీ కంపెనీలలో ఫ్రెంచ్కు చెందిన సిట్రోయెన్ ఒకటి. కంపెనీ తన తాజా కూపే SUV సిట్రోయెన్ బసాల్ట్‌ను కొంతకాలం క్రితం విడుదల చేసింది. అయితే ఈ న్యూ ఇయర్ ప్రారంభం అయిన వెంటనే సిట్రోయెన్ దాని ధరను పెంచింది. దీంతో ఇప్పుడు మార్కెట్లో ఈ కారు ధర రూ. 8.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది మునుపటి కంటే రూ. 26,000 ఎక్కువ.
దీన్ని ఆగస్ట్ 2024లో ప్రారంభించినప్పుడు దీని అగ్రెసివ్ ప్రైసింగ్ స్ట్రాటజీతో ఇండియన్ ఆటోమోటివ్ కంపెనీలను ఆశ్చర్యపరిచింది. బసాల్ట్ ఒక కంపాక్ట్ SUV. అయితే సబ్ 4 మీటర్ SUV స్థాయిలో దీని ధర నిర్ణయించారు. దీంతో ఈ కారు భారీ విక్రయాలతో దూసుకుపోతుందని కంపెనీ అంచనా వేసింది. అయితే అనుకున్నంత మంచి స్థాయిలో ఇది సేల్స్ రాబట్టలేకపోయింది.
ఇది ఆకర్షణీయమైన ధరను కలిగి ఉన్నప్పటికీ కంపెనీ గత నెలలో కంపెనీ బసాల్ట్ 79 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. అయితే ఇప్పుడు దీని ధరలను సవరించడంతో ఇది మునుపటి కంటే ఎక్కువ ఖరీదైనదిగా మారింది. దీంతో ఇది మునుపటి కంటే తక్కువ ఆకర్షణీయంగా మారింది. లాంఛ్ ధరలతో పోలిస్తే కంపెనీ ఈ కారు ఎక్స్-షోరూమ్ ధరను గరిష్టంగా రూ.28,000 వరకు పెంచింది.
ట్రిమ్ ఆప్షన్లు: కంపెనీ దీన్ని మూడు ట్రిమ్స్‌లో తీసుకొచ్చింది.
- యూ
- ప్లస్
- మాక్స్
ఇంజిన్:
- ఈ సిట్రోయెన్ బసాల్ట్ ఎంట్రీ లెవల్ యూ ట్రిమ్ సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే ఉంటుంది.
- దీని మిడ్-వేరియంట్ ప్లస్ ట్రిమ్ సహజంగా ఆశించిన, టర్బో-పెట్రోల్ రెండింటితో వస్తుంది.
- ఇక దీని టాప్-స్పెక్ మ్యాక్స్ వేరియంట్ విషయానికి వస్తే దీన్ని టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే విక్రయింస్తున్నారు.
ధరలు:
- ప్రస్తుతం సిట్రోయెన్ బసాల్ట్ బేస్ యు వేరియంట్ ధర రూ. 26,000 పెరిగింది. దీంతో ఇప్పుడు దీని ధర రూ. 8.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇంతకు ముందు దీన్ని మార్కెట్లో రూ. 7.99 లక్షలకు విక్రయించారు.
- దీని మిడ్-స్పెక్ ప్లస్ 1.2 MT ధరలో కంపెనీ ఎలాంటి మార్పూ చేయలేదు. ఇది ఇప్పుడు కూడా రూ.9.99 లక్షలకే మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ప్లస్ 1.2 టర్బో MT, ప్లస్ 1.2 టర్బో AT వేరియంట్‌ల ధర రూ. 28,000 (ఎక్స్-షోరూమ్) పెరిగింది.
- ఇక దీని టాప్-స్పెక్ మ్యాక్స్ 1.2 టర్బో MT వేరియంట్, డ్యూయల్-టోన్ ధర ఒకేలా రూ. 21,000 (ఎక్స్-షోరూమ్) పెరిగింది. చివరగా సిట్రోయెన్ బసాల్ట్ మాక్స్ 1.2 టర్బో AT వేరియంట్, దాని డ్యూయల్-టోన్ ఉన్నాయి. వీటి ధర రూ. 17,000 (ఎక్స్-షోరూమ్) పెరిగింది.
ఇస్రో స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ వాయిదా- కారణం ఏంటంటే?
టెక్నో పాప్ 9 5G నయా వేరియంట్ ఆగయా- 8GB RAM అండ్ 128GB స్టోరేజీతో రూ.10,999లకే!
ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్- ఈసారి ఎన్ని బైక్‌లు అమ్ముడయ్యాయో తెలుసా?
సాంకేతికతలో విప్లవ మార్పులు- అంతరిక్షంలో 'పురుడు' పోసుకున్న జీవం!- ఇస్రో మరో ఘనత