ETV Bharat / state

ఫిర్యాదులకు మూడు వారాల్లో పరిష్కారం చూపిస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్ - HYDRA PRAJAVANI PROGRAMME

బుద్దభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో ప్రారంభమైన ప్రజావాణి - ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా తీసుకున్న హైడ్రా కమిషనర్ - వివిధ ప్రాంతాలు, జిల్లాల నుంచి సుమారు 83 ఫిర్యాదులు

HYDRA IN HYDERABAD
ప్రజావాణిలో ఫిర్యాదులను పరిశీలిస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2025, 10:55 PM IST

Commissioner Ranganath in Hydra Prajavani : తమకు అందిన ఫిర్యాదులకు మూడువారాల్లో పరిష్కార మార్గం చూపిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించిన రంగనాథ్ వాటిని పరిశీలించి పూర్తి నివేదిక తయారుచేయాలని అధికారులని అప్పటికప్పుడే ఆదేశించారు. ఆక్రమణలపై కమిషనర్ సత్వరమే స్పందించడం పట్ల ఫిర్యాదుదారులు హర్షం వ్యక్తంచేశారు.

మొదటి ప్రజావాణిలోనే 83 ఫిర్యాదులు : హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా బుద్దభవన్‌లోని కార్యాలయంలో ప్రజావాణిని ప్రారంభించింది. తొలిరోజే హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ ప్రాంతాలు, జిల్లాల నుంచి సుమారు 83 మంది ఫిర్యాదు చేశారు. చెరువులు, పార్కులు, ర‌హ‌దారుల క‌బ్జాపై ఫిర్యాదులు అందాయి. ప్రజావ‌స‌రాల‌కి ఉద్దేశించిన స్థలాలను కొందరు ఆక్రమణదారులు కాజేస్తున్నారంటూ అందుకు సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులకు మూడు వారాల్లో పరిష్కారం చూపిస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్ (ETV Bharat)

మూడు వారాల్లో : ఒక్కొ ఫిర్యాదును పరిశీలించిన రంగనాథ్ అప్పటికప్పుడే సంబంధిత అధికారులకు సూచన చేస్తూ మూడు వారాల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఫిర్యాదులు అందిన ప్రాంతాల్లో నిజనిర్ధారణ చేయాలని సూచించారు. పలువురు ఫిర్యాదుదారులతో మాట్లాడుతూ వివరాలు తెలుసుకున్న రంగనాథ్ 3 వారాల్లో పరిష్కార మార్గం చూపిస్తామని భరోసా ఇచ్చారు.

ఇతర జిల్లాల నుంచి : ఔట‌ర్ రింగ్‌రోడ్డు ప‌రిధిదాటి ఇత‌ర జిల్లాల నుంచి వ‌చ్చిన ఫిర్యాదుదారుల‌కు త‌మ ప‌రిధిలో లేద‌ని న‌చ్చజెప్పి పంపించారు. అలాగే ఇత‌ర శాఖ‌ల‌కు చెందిన స‌మ‌స్యలపై ఫిర్యాదులు రావడంతో వాటిని ఆయా శాఖాధిప‌తుల‌కు అందించాలని క‌మిష‌న‌ర్ సూచించారు. పాత లేఔట్‌ ప‌క్కనపెట్టి ఫోర్జరీ లేఔట్‌తో పార్కుల‌ు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు కాజేసిన క‌బ్జాదారుల‌పై ఎక్కువగా ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ భూమి స్వాహా : కూకట్‌పల్లికి చెందిన ఓ విశ్రాంత సైనికుడికి ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలం సహా పార్కు స్థలాన్ని స్థానికంగా ఉన్న ఓ మ‌హిళ కాజేసింద‌ని స్థానిక‌ అధికారుల‌కు ఫిర్యాదు చేసినా స్పందించ‌లేద‌ని క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లారు. జవ‌హర్‌న‌గ‌ర్‌లో ప్రభుత్వభూమిని నోట‌రీచేసి అమ్మేస్తున్నార‌ని 6 వేల ఎక‌రాల‌కు రెండున్నర వేలు మాత్రమే మిగిలుంద‌ని వివరించారు. ఆ భూమిసైతం ప్లాట్లు చేసి అక్రమ లేఔట్‌తో విక్రయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

చిలుకా నగర్ కార్పొరేటర్ భర్త ఫిర్యాదు : తాజాగా 15 ఎక‌రాలను స్థానికంగా ఉన్న వ్యక్తి కాజేయాల‌ని యత్నిస్తున్నారని హైడ్రా కమిషనర్‌కి ముఖేష్‌కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. నాలాని ఆనుకొని ఉన్న నీటిపారుదలశాఖకు చెందిన ప్రభుత్వ స్థలాన్ని 60 గ‌జాలప్లాట్లు చేసి అమ్మేస్తున్నార‌ని వ‌ర‌దనీరు వ‌చ్చి చేరే లోత‌ట్టులో పేద‌వారు ఇల్లు కొనుక్కొని మోస‌పోతున్నార‌ని వెంటనే ఆపాలని చిల‌ుకాన‌గ‌ర్ కార్పొరేట‌ర్ భ‌ర్త హైడ్రా క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదుచేశారు.

మురుగు నీరు నేరుగా చెరువులోకి : మియాపూర్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని బ‌క్షికుంట‌, రేగుల కుంటల‌ను సుంద‌రీక‌రిస్తే ఆయా చెరువుల్లోకి మురుగునీరు వ‌దిలేస్తున్నార‌ని చందాన‌గ‌ర్‌కి చెందిన ప్రజాసంఘాల నాయ‌కులు క‌మిష‌న‌ర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న గేటెడ్ క‌మ్యూనిటీకి చెందిన వ్యక్తులు మురుగునీరు శుభ్రం చేయ‌కుండా నేరుగా చెరువులోకి వ‌దిలేయ‌డంతో కోట్లు ఖ‌ర్చు చేసిన చెరువు మ‌ళ్లీ దుర్గంధంగా మారుతోంద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. వ‌ర‌ద కాల్వలు క‌బ్జా అవుతున్నాయని చందాన‌గ‌ర్‌వాసులు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్‌తోపాటు అధికారులు సానుకూలంగా స్పందించడపై ఫిర్యాదు దారులు హర్షం వ్యక్తంచేశారు. మూడు వారాల్లో పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆనందంగా వెనుదిరిగారు.

'హైడ్రా' మళ్లీ మొదలెట్టింది - మాదాపూర్​లో 5 అంతస్తుల భవనం కూల్చివేత

ఈదులకుంట దొరికేసిందోచ్ - ఎట్టకేలకు ఆచూకీ కనిపెట్టిన హైడ్రా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.