Prathidwani: సెల్‌లో బందీ కాకుండా డిజిటల్ దూరం పాటించడమెలా ?
🎬 Watch Now: Feature Video
Prathidwani: తరచు.. స్మార్ట్ ఫోన్‌లో లీనమై పోతున్నారా ? సమయం తెలియకుండా సామాజిక మాధ్యమాల్లో గడిపేస్తున్నారా ? కొద్దిసేపు ఫోన్ వాడకపోతే గాబరా పడుతున్నారా ? ఐతే మీరు... ‘నోమొఫోబియా’ బారిన పడి ఉండొచ్చు. 61% మంది ప్రజలు అంతర్జాలానికి, డిజిటల్ స్క్రీన్‌లకు బానిస అయ్యారని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇది జీవన నాణ్యత దెబ్బ తీయడమే కాక మానసిక, శారీరక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. కొద్దిసేపు పనిలో పడ్డా.. ఏదో గుర్తు వచ్చినట్లు ఫోన్ తీసుకొని నోటిఫికేషన్లు తనిఖీ చేయడం పరిపాటిగా మారింది. ఎక్కువ సేపు స్క్రీన్ చూడటం ఒంటరితనానికి దగ్గర చేస్తుంది. అందుకే ఇప్పుడు డిజిటల్ డిటాక్స్‌కు ప్రయత్నిస్తున్నారు. అసలు పరిస్థితి ఇంత వరకు ఎందుకు వచ్చింది ? సెల్‌లో బందీ కాకుండా డిజిటల్ దూరం పాటించడమెలా ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో టెక్నాలజీ నిపుణులు సాయి సతీష్, సైకియాట్రిస్ట్ డా. మానసలు పాల్గొని తమ అభిప్రాయాలు అందజేశారు.