Praggnanandhaa Chess : ప్రజ్ఞానందకు చెన్నై వాసుల గ్రాండ్ వెలకమ్.. సంప్రదాయ నృత్యం, డప్పులతో..
🎬 Watch Now: Feature Video
Published : Aug 30, 2023, 12:01 PM IST
Praggnanandhaa Chess : ఇటీవలే జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందకు చెన్నై ప్రజలు ఘన స్వాగతం పలికారు. అతని రాకకు ముందే విమానాశ్రయానికి చేరుకున్న జనం.. బొకేలతో వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైపోయారు. ఇక అక్కడి జనంతో పాటు ప్రజ్ఞానందను చూసేందుకు అతని స్కూల్ మేట్స్ కూడా విమానాశ్రయానికి వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. మేళ తాళాలు, సాంస్కృతిక నృత్యాలతో అతనికి గ్రాండ్ వెలకమ్ చెప్పారు.
Praggnandaa Grand Welcome : ప్రజలు చూపించిన అభిమానం పట్ల ప్రజ్ఞానంద సంతోషం వ్యక్తం చేశాడు. ఇలా తనని ఆదరించడం ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. మరోవైపు ప్రజ్ఞానంద ఇంటి వద్ద కూడా పండగ వాతావరణం నెలకొంది. తన రాకకై ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు ఇంటి ఆవరణను హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలతో ముస్తాబు చేశారు.
Praggnanandhaa Next Tournament : బాకు వేదికగా జరిగిన ఫిడే చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో మాగ్నస్ కార్ల్‌సన్‌పై ఓటమిపాలై ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. అయినా 18 ఏళ్ల వయసులోనే ప్రజ్ఞానంద పోరాడిన తీరుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. దిగ్గజ చేసే ప్లేయర్ కార్ల్సన్తో హోరాహోరీగా పోరాడిన ప్రజ్ఞానందను అందరూ మెచ్చుకుంటున్నారు.