Pawan Kalyan on Chandrababu Arrest: మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్​కల్యాణ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 9:19 PM IST

Updated : Sep 10, 2023, 6:33 AM IST

Pawan Kalyan on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఖండించారు. ఏ తప్పూ చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.  రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇలాంటి చర్యలను వైసీపీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని  పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్టు చేయడం సరికాదని పవన్ హితవుపలికారు.  శాంతిభద్రతలను కాపాడాల్సింది పోలీసులే కదా అంటూ ప్రశ్నించిన పవన్...  శాంతిభద్రతల విషయంలో వైసీపీకి సంబంధమేంటని విమర్శలు గుప్పించారు. అరాచకాలు జరుగుతున్నది వైసీపీ(YCP) వల్లే కదా? అంటూ ఎద్దేవా చేశారు.  ఒక నాయకుడు అరెస్టయితే మద్దతుగా కచ్చితంగా అభిమానులు బయటకొస్తారని... నాయకుడికి మద్దతుగా రావడం ప్రజాస్వామ్యంలో భాగమే కదా అంటూ వెల్లడించారు.  ఇళ్లలో నుంచి బయటకెవరూ రాకూడదంటే ఎలా? అంటూ ప్రశ్నించారు. 

 విజయవాడ పర్యటన: ఉదయం చంద్రబాబు అరెస్టు పరిణామాలతో.. హైదరాబాద్‌ నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉదయం  విజయవాడ వచ్చేందుకు సిద్ధమయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరేందుకు పవన్‌ సిద్ధమయ్యారు. కానీ పవన్ కల్యాణ్‌ ప్రత్యేక విమానానికి విమానాశ్రయ అధికారుల నుంచి అనుమతి లభించలేదు. విమానాశ్రయ అధికారుల అనుమతి కోసం మెుదట  పవన్‌ వేచిచూశారు. పవన్ కల్యాణ్‌ విజయవాడ పర్యటన నేపథ్యంలో ఏపీ పోలీస్​లు శాంతిభద్రతల సమస్యల పేరుతో పవన్​కు మెయిల్‌ పంపినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపాయి.  

కారులో విజయవాడ బయలుదేరిని పవన్​ను అడ్డుకున్న పోలీసులు:  ఏపీకి విమానంలో వచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. కారులో విజయవాడ బయలు దేరిన పవన్​ను ఎన్టీఆర్‌ జిల్లా గరికిపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పవన్ రాకకు పోలీసులు అనుమతిలేదని అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే పడుకున్న జనసేనాని నిరసన తెలిపారు. పవన్ కు మద్దతుగా భారీగా విజయవాడ హైవే పైకి వచ్చిన జనసేన కార్యకర్తలు..  నిరసన వ్యక్తం చేశారు. దీంతో గరికిపాడు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్పెషల్ ఫ్లైట్ లాండింగ్ అనుమతి నిరాకరణతో విజయవాడకు రోడ్డు మార్గంలో పవన్ వచ్చారు. రాష్ట్రానికి వచ్చేందుకు వీసా, పాస్‌పోర్ట్ కావాలేమో అంటూ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. 

పార్టీ కార్యాలయానికి జనసేనాని: పవన్‌ కల్యాణ్​కు మద్దతుగా వేలాదిగా జనసేన కార్యకర్తలు తరలిరాగా.. పోలీసులు చివరకు దిగివచ్చారు. మూడు వాహనాలకు అనుమతిచ్చి పోలీసు ఎస్కార్ట్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

Last Updated : Sep 10, 2023, 6:33 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.