Impact of Digital Addiction on Mental Health: టెక్నాలజీ పెరుగుతున్న వేళ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్‌ఫోన్ దర్శనమిస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ తప్పనిసరిగా ఉండాల్సిందేనన్న పరిస్థితి నెలకొంది. చేతిలో ఫోన్ లేకుంటే పూట గడవని పరిస్థితి. ఇలా స్మార్ట్‌ఫోన్ వినియోగం ఒక వ్యసనంలా మారిపోయింది. అయితే ఈ విస్తృత స్మార్ట్‌ఫోన్ వాడకం ఎన్నో మానసిక సమస్యలకు దారి తీస్తోందని, ఇది ఆత్మహత్యల ఆలోచనలను కూడా ప్రేరేపితం చేస్తోందని సర్వేలు చెబుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద సమగ్ర మానసిక ఆరోగ్య ప్రొఫైల్‌ల డేటాబేస్‌ను హోస్ట్ చేసే గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ డేటా ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని ప్రారంభించిన వయస్సు, వారి వయోజన మెంటల్ హెల్త్ మధ్య సంబంధం ఉందని తెలుస్తోంది. అంటే ఎంత చిన్న వయస్సులో స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని ప్రారంభిస్తే అంత ఎక్కువ మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సర్వే చెబుతోంది.
1997-2012 మధ్య జన్మించిన జనరేషన్ Z ఈ డిజిటల్ నెట్‌వర్క్‌కు బానిసైన మొదటి గ్రూప్. దీంతో ఈ డిజిటల్ అడిక్షన్ 18 నుంచి 24 సంవత్సరాల వయసు నిండిన వారి మెంటల్ హెల్త్ (మెంటల్ వెల్-బీయింగ్)పై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని సర్వేలో తేలింది.
ఇక్కడ మెంటల్ వెల్-బీయింగ్ అంటే జీవిత ఒత్తిళ్లు, సవాళ్లను సమర్థవంతంగా నావిగేట్ చేయగల సామర్థ్యం. ఇది మెంటల్ ఫంక్షన్‌ను 47 కోణాలలో కొలుస్తుంది. దీని ప్రకారం ఎంత చిన్న వయసులో స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని మొదలుపెడితే వారు అంత ఎక్కువగా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీటిలో సూసైడ్ ఆలోచనలు, రియాలిటీకి దూరంగా ఉండటం, ఇతరుల పట్ల దూకుడు స్వభావం వంటివి ఉన్నాయి.
డిజిటల్ అడిక్షన్ పెరిగేకొద్దీ మానసిక, నిద్ర సమస్యలు పెరుగుతాయి. ఎంత ఎక్కువగా డిజిటల్ టెక్నాలజీకి బానిసలైతే వారి మానసిక ఆరోగ్య కోటియంట్ (MHQ) అంత అధ్వాన్నంగా తయారవుతుంది. గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్‌లో సేకరించిన డేటా భారత్‌లో 18-24 మధ్య వయసున్న వారిలో 12.5 శాతం మంది 2024 నాటికి డిజిటల్ అడిక్షన్ బారిన పడినట్లు సూచిస్తుంది. ఇది 2021లో దాదాపు 9.3 శాతంగా ఉంది.
గ్లోబల్ మైండ్ డేటా ప్రకారం భారతీయ యువతలో దాదాపు 40 శాతం మంది మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అయితే ఎక్స్ట్రీమ్గా డిజిటల్ అడిక్షన్‌కు గురైన వారు 90శాతం మంది. ఈ తీవ్రమైన అడిక్షన్తో మానసిక ఆరోగ్యం పోరాటం చేస్తోంది.
ఆత్మహత్యల ఆలోచనలు: మన దేశంలోని యువతలో డిజిటల్ అడిక్షన్ ఆత్మహత్యల ఆలోచలనలు లేదా ఉద్దేశాలతో కూడా అసోసియేట్ అయి ఉంది. అస్సలు డిజిటల్ నెట్‌వర్క్‌కు అడిక్ట్ కానివారులో 55 శాతం మంది సూసైడ్ థాట్స్ లేదా ఇంటెన్షన్స్ ఫీల్‌ను అనుభవించారు. ఇది చాలా ఆందోళనను కలిగిస్తుంది. ఇకపోతే డిజిటల్ టెక్నాలజీకి తీవ్రంగా బానిసలైన వారిలో ఈ సంఖ్య 80 శాతానికి పెరిగింది.
నిద్రలేమి సమస్యలు: డిజిటల్ అడిక్షన్ ఉన్నవారిలో నిద్ర లేమి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని మునుపటి పరిశోధనల్లో తేలింది. డిజిటల్ టెక్నాలజీకి అస్సలు బానిస కాని యువకులలో దాదాపు 5 శాతం మంది తాము చాలా అరుదుగా నిద్రపోతున్నామని నివేదిస్తున్నారు. అయితే టెక్నాలజీకి ఎక్కువగా బానిసలైన వారిలో అయితే 14 శాతం మంది తాము చాలా అరుదుగా నిద్రపోతున్నామని చెబుతున్నారు. అంటే డిజిటల్ స్క్రీన్కు బానిసైన వారు ఇంచుమించు మూడు రెట్లు ఎక్కువగా నిద్ర లేమి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఈ వ్యసనం ఇతర మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి నిద్ర ఆరోగ్యకరమైన బ్రెయిన్ ఫంక్షనింగ్‌లో సహాయపడుతుంది కాబట్టి.
ఈ ముప్పును మనం ఎలా అరికట్టవచ్చు?: ఈ ముప్పును మనం అరికట్టలేమా అంటే దీనిపై మునుపటి అనాలసిస్ కొన్ని ఇన్సైట్స్ను అందిస్తుంది. అవి:
స్మార్ట్‌ఫోన్‌ను వాడకాన్ని ఎంత చిన్న వయసులో ప్రారంభిస్తే అన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు ఎంత ఎక్కువ వయసులో అంటే వీలైనంత ఆలస్యంగా స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తే మంచింది.
తోటివారిని చూసి పిల్లలు తమకు కూడా స్మార్ట్‌ఫోన్ కావాలని మారాం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో చిన్నపిల్లలకు స్మార్ట్‌ఫోన్ వాడకం, అనుమతిని నిషేధించే దిశగా సంస్కరణలు తీసుకువస్తే బాగుంటుంది. ఇప్పటికే అనేక దేశాలు పాఠశాల్లో స్మార్ట్‌ఫోన్ నిషేధించే అంశంపై పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని పాఠశాలలు కూడా స్కూల్ ఆవరణంలో స్మార్ట్‌ఫోన్ నిషేధాన్ని విధించడం స్వతహాగా ప్రారంభించాయి.
డిజిటల్ టెక్నాలజీ అధిక వినియోగం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను చేపట్టడం అవసరం.
ఉదాహరణకు ధూమపాన విధానం గురించి తీసుకుంటే.. మన దేశంలోని పాఠశాలల్లో పొగాకు వ్యతిరేక ప్రచారాలు భారీగా ప్రారంభించారు. డిమాండ్‌ను అరికట్టడానికి సిగరెట్ పన్నులు ఉపయోగించారు. ఈ ప్రయత్నాలు సిగరెట్ వినియోగాన్ని తగ్గించాయి.
అదేవిధంగా వ్యాయామం చేయడం ద్వారా సెంట్రల్ అండ్ అటానమస్ నెర్వస్ సిస్టమ్స్ న్యూరోబయాలజీని నియంత్రించి డిజిటల్ అడిక్షన్‌ను తగ్గించొచ్చని ఓ అధ్యయనం తెలిపింది.
18 సంవత్సరాల వరకు వీడియో గేమ్స్‌పై చైనా విధించిన ఆంక్షల మాదిరిగానే పిల్లలను లక్ష్యంగా చేసుకున్న మొబైల్స్ యాప్‌లను నియంత్రించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇటీవల US సర్జన్ జనరల్ వివేక్ మూర్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పొగాకు, ఆల్కహాల్ ఉత్పత్తులపై ఉన్న వార్నింగ్ లేబుల్స్‌ను సమర్థిస్తూ మాట్లాడారు.
భారతదేశంలో 18-24 సంవత్సరాల వయస్సు గలవారిలో డిజిటల్ వ్యసనం అధ్వాన్నమైన మానసిక శ్రేయస్సు, అధిక ఆత్మహత్య ధోరణులు, పేలవమైన నిద్ర అలవాట్లతో ముడిపడి ఉంది. మన దేశంలో అంచనా వేసిన ఆర్థిక వృద్ధిలో ఎక్కువ భాగం యువతరం ఉత్పాదకతపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ఆందోళన కలిగిస్తుంది.
2024లో డిజిటల్ అడిక్షన్ 12.5 శాతంగా ఉన్నప్పటికీ అది పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్‌ల యాజమాన్య వయస్సును ఆలస్యం చేయడం వల్ల ఆత్మహత్య ఆలోచనలు, ఉద్దేశాలు తగ్గుతూ మానసిక శ్రేయస్సు మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
మొత్తం మీద పాఠశాల విధానాలు, తల్లిదండ్రుల నియంత్రణలు, ప్రజారోగ్య సందేశాలు, నియంత్రణ కార్యక్రమాలతో డిజిటల్ టెక్నాలజీకి వ్యసనాన్ని ఎలా అరికట్టవచ్చో అర్థం చేసుకోవడంపై ఎక్కువ శ్రద్ధ పెట్టవచ్చు.
ఈవీ రంగంపై కేంద్రం వరాల జల్లు- ఇకపై తగ్గనున్న ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, ఫోన్ల ధరలు!
ఎడ్యుకేషన్‌లోనూ ఏఐ- రూ.500కోట్లు కేటాయించిన కేంద్రం
చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌కు పోటీగా ఇండియన్ ఏఐ మోడల్!- అందుబాటులోకి ఎప్పుడంటే?