Producer KP Chowdary Died In Goa : డ్రగ్స్ కేసు నిందితుడు, నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు. గోవాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేపీ చౌదరి మృతిపై పాల్వంచలో ఉన్న తల్లికి పోలీసుల సమాచారం అందించారు. గతంలో డ్రగ్స్ విక్రయిస్తుండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు.
కేపీ చౌదరి తెలుగు, తమిళం సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా పని చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అర్జున్ సురవరం సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు.