ETV Bharat / health

'గ్రీన్ టీ తాగితే బరువుతో పాటు క్యాన్సర్ తగ్గుతుంది'- ఇంకా నొప్పులు మాయం! - GREEN TEA HEALTH BENEFITS

-గ్రీన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు -జలుబు, దగ్గుతో బాధపడేవారికి మేలు!

green tea benefits in telugu
green tea benefits in telugu (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Feb 3, 2025, 5:14 PM IST

Green Tea Health Benefits: మనలో చాలా మందికి తెల్లారగానే టీ, కాఫీ తాగకపోతే వెలితిగా ఉంటుంది. ఏదో ఒకటి కడుపులో పడేస్తేనే హాయిగా ఉంటుందని అంటుంటారు. కానీ, వీటికి బదులుగా ఉదయాన్నే గ్రీన్‌ టీని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆ రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ అంజలీదేవి వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

"గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఆహారం అరుగుదల బాగుంటుంది. ఇంకా దీన్ని తాగడం వల్ల వయసు మళ్లిన వారు కూడా చాలా ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యంగా మధుమేహులు, అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ఇందులో క్యాన్సర్‌ సెల్స్‌ ఎక్కువగా పెరగకుండా చూసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. క్యాన్సర్‌ తొలి దశలో ఉన్న వారు ప్రతి రోజు గ్రీన్‌ టీని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు ఉన్నవారికి మేలు చేస్తుంది. వాకింగ్‌ వెళ్లి వచ్చిన తర్వాత తాగితే మరీ మంచిది."

--డాక్టర్ అంజలీ దేవి, పోషకాహార నిపుణులు

గ్రీన్​ టీ లో ఎలాంటి విష, అనారోగ్య కారకాలు లేవని డాక్టర్ అంజలీ దేవి చెబుతున్నారు. ఫలితంగా చిన్నా పెద్దా తేడా లేకుండా ఎవరైనా తాగొచ్చని సూచిస్తున్నారు. ఇందులో మెండుగా ఉండే రెసిపెరిట్రాల్‌ అనే పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి.. రక్తం గడ్డకట్టకుండా చూస్తుందని వివరిస్తున్నారు. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటుందని తెలిపారు. గ్రీన్​ టీలో శరీరంలోని కొవ్వులను కరిగించే శక్తి ఉన్నట్టు తేలిందని అంటున్నారు. అందుకే స్థూలకాయంతో బాధపడేవాళ్లు వ్యాయామంతో పాటు గ్రీన్‌ టీ తాగితే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయని పేర్కొన్నారు. ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడిని నివారిస్తుందని.. ఇంకా దీనిని ఏ సమయంలోనైనా తాగొచ్చని చెబుతున్నారు. అయితే, శరీరానికి మంచిదని గ్రీన్ టీని అతి తాగొద్దని చెబుతున్నారు. ఎక్కువగా తాగడం వల్ల నిద్రలేమికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్రీన్‌ టీ పొడిగా కంటే ఆకులుగా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజూ స్నానం చేయడం మంచిది కాదా? ఎన్ని రోజులకోసారి చేయాలి? నిపుణులు ఏం అంటున్నారంటే?

'రోజూ టిఫిన్ చేస్తే బరువు తగ్గుతారు'- బ్రేక్​ఫాస్ట్ చేసేవారు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.