New Police Station to Be Opened in Shamshabad Airport : శంషాబాద్ విమానాశ్రయంలో 17 సంవత్సరాల తర్వాత కొత్త పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించడానికి పోలీసులు సర్వం సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్, జెపాడ్ సమీపంలో అన్ని హంగులతో పోలీస్ స్టేషన్ ముస్తాబైంది. త్వరలోనే ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి, ఇద్దరు ఎస్సైలు, 20 నుంచి 25 మంది సిబ్బంది సేవలు అందించనున్నారు.
విధుల్లో ఉండగా హెడ్ కానిస్టేబుల్కు హార్ట్ ఎటాక్ - ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
నిత్యం వేలమంది ప్రయాణించే శంషాబాద్ విమానాశ్రయంలో చోరీలు, నేరాలు, మోసాల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బాధితులు ఫిర్యాదులు చేయాలంటే 7 కి.మీ దూరంలోని ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొత్త స్టేషన్ ఏర్పాటైతే విమాన ప్రయాణికులకు ఎలాంటి సమస్య లేకుండా ఎయిర్‌పోర్టు ఠాణాలో ఫిర్యాదు చేయవచ్చు. విమానాశ్రయం పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభిస్తారు. శంషాబాద్ జోన్ పరిధిలో శంషాబాద్, షాద్‌నగర్ ఏసీపీ డివిజన్లతో పాటు 11 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఎయిర్‌పోర్టులో కొత్త ఠాణా ప్రారంభమైతే ఆ సంఖ్య 12కు చేరుతుంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ - సందర్శకులు రావొద్దని ప్రకటన