ETV Bharat / entertainment

రానా సూపర్ స్కెచ్- వర్కౌట్ అయితే టాలీవుడ్​లో నయా ట్రెండ్! - RANA SUPER PLAN

టాలీవుడ్ హల్క్ రానా మాస్టర్ ప్లాన్- సిద్ధూ జొన్నలగడ్డ సినిమా రిరిలీజ్- గతంలో ఓటీటీలో విడుదలైన మూవీ

rana
rana (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2025, 4:41 PM IST

Rana Super Plan Krishna And His Leela : ప్రస్తుతం టాలీవుడ్​లో రీరిలీజ్​ల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు ప్రేక్షకులు అంతగా ఆదరించని సినిమాలు కూడా, రీరిలీజ్​లో అద్భుతమైన కలెక్షన్లతో అదరగొడుతున్నాయి. తమ అభిమాన హీరో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు సైతం క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు థియేటర్లలో విడుదలైన సినిమాలే మళ్లీ రిరిలీజ్ అయ్యాయి. అయితే ఓటీటీలో రిలీజైన ఓ సినిమాను థియేటర్​లో రిరిలీజ్ చేసేందుకు టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా భారీ స్కెచ్ వేశారు. అది కూడా కొత్త టైటిల్​తో. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? తదితర విషయాలు తెలుసుకుందాం.

'కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా' రిలీజ్
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా చిన్న హీరోలను ప్రోత్సహించడంలో ముందుంటారు. తక్కువ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించే దర్శకుల సైతం ప్రోత్సహించి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు. అలాంటి సినిమానే రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కిన 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా'. ఈ సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ హీరో. కెరీర్ తొలినాళ్లలో ఆయన ఈ మూవీలో నటించారు. రవికాంత్‌ పేరేపు దర్శకత్వం వహించగా, శ్రద్ధా శ్రీనాథ్‌, సీరత్‌ కపూర్‌, షాలినీ హీరోయిన్లుగా నటించారు.

కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్
విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ కరోనా కారణంగా థియేటర్లలో రిలీజ్ కాలేదు. 2020లో ఆహా వేదికగా విడుదలై యూత్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాతో సిద్ధూ యూత్‌ లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్‌ రిలీజ్‌ కు రెడీ అయ్యింది. లవర్స్ డేను పురస్కరించుకొని ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. అయితే ఈసారి 'ఇట్స్‌ కాంప్లికేటెడ్‌' పేరుతో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం స్పెషల్‌ వీడియో విడుదల చేసింది. రానా - సిద్ధూ జొన్నలగడ్డ సరదా సంభాషణతో ఈ వీడియో సినీ ప్రియులను ఆకట్టుకుంది.

ఫన్నీ సంభాషణ
ఈ వీడియోలో తనతో మరో సినిమా చేయమని దర్శకుడు రవికాంత్‌ అడగ్గా, రానా దగ్గుబాటి నిర్మాతగా ఉంటే తాను చేయనని సిద్ధూ చెబుతారు. రానా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయరని, ఇంగ్లిష్ పండగైన వాలెంటైన్స్ డేకి 'ఇట్స్‌ కాంప్లికేటెడ్‌' చిత్రాన్ని విడుదల చేస్తే అప్పుడు తన బ్యానర్ లో మరో మూవీ చేస్తానని అంటారు. థియేట్రికల్ రిలీజ్ చేయడమే కాదు, 'స్టార్ బాయ్' అనే ట్యాగ్ కూడా వేస్తానని రానా చెబుతారు. అలా అయితే హీరోయిన్లతో కలిసి మూవీ ప్రమోషన్స్ చేయడానికి కూడా రెడీ అని సిద్ధూ బదులిస్తారు. రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ చేయడం ఇల్లీగల్ అని, పాత టైటిల్ అసలు తమకు గుర్తే లేదంటూ సరదాగా సాగిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది.

సినిమా కథేంటంటే?
వైజాగ్‌కు చెందిన కృష్ణ (సిద్ధూ జొన్నలగడ్డ) తన స్నేహితురాలు సత్య (శ్రద్ధా శ్రీనాథ్)ను లవ్ చేస్తాడు. కొన్ని కారణాల వల్ల వారి లవ్ బ్రేకప్ అవుతుంది. ఉద్యోగాల కోసం కృష్ణ బెంగళూరుకు వెళ్లగా, అక్కడ రాధ (షాలిని) అనే అమ్మాయితో అతడికి పరిచయం ఏర్పడుతుంది. కొంతకాలానికి వారి మధ్య ప్రేమ పుడుతుంది. అదే సమయంలో అతడి జీవితంలోకి మళ్లీ సత్య రీఎంట్రీ ఇస్తుంది. మరి, కృష్ణ ఏం చేశాడు? వారిద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కృష్ణకు రుక్సార్‌ (సీరత్‌ కపూర్‌)కు ఉన్న సంబంధం ఏమిటి? అనే ఆసక్తికర విషయాలతో ఈ సినిమా తెరకెక్కింది.

హిట్ అయ్యే మరిన్ని సినిమాలు థియేటర్​లోకి!
అయితే గత కొన్నాళ్లుగా పాత సినిమాలే రిరిలీజ్ అయి హిట్లు కొడుతున్నాయి. అలాగే భారీగా కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. తాజాగా రానా దగ్గుబాటి ఓటీటీలో రిలీజైన సినిమాను పేరు మార్చి థియేటర్లలో తీసుకొస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే కరోనా సమయంలో ఓటీటీలో రిలీజైన మరిన్ని సినిమాలు బిగ్ స్క్రీన్​లో విడుదలయ్యే అవకాశం ఉంది. మరి రానా నిర్మించిన ఈ సినిమా ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.