ETV Bharat / state

ఫేర్​వెల్​ పార్టీ నుంచి ఆలస్యంగా రావడమే తప్పైంది - తొమ్మిదో తరగతి విద్యార్థిని కొట్టి చంపిన తండ్రి - STUDENT BEATEN TO DEATH BY FATHER

చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో విషాదం - మద్యం మత్తులో కుమారుడిని కొట్టి చంపిన తండ్రి - తండ్రి కొట్టిన దెబ్బలతో 9వ తరగతి విద్యార్థి (14) మృతి

CHOUTUPPAL BOY DEATH CASE
CHOUTUPPAL BOY DEATH CASE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2025, 5:35 PM IST

Choutuppal Death Case : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఆరెగూడెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో సైదులు అనే వ్యక్తి తన కుమారుడిని కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందాడు. 9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తమ పాఠశాలలో శనివారం నిర్వహించిన ఫేర్‌వెల్‌ పార్టీకి వెళ్లాడు. అయితే, ఇంటికి ఆలస్యంగా వచ్చాడన్న కోపంతో మద్యం మత్తులో సైదులు విద్యార్థిని చితకబాదాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు : ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం లేకుండా ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించారు. నిందితుడు సైదులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

పురుగుల మందు తాగి బావ, మరదలు బలవన్మరణం - అప్పుల బాధతోనే కుటుంబం చనిపోవాలని నిర్ణయం

ఇంటి స్థలం విషయంలో వివాదం - పోలీసుల వేధింపులకు వ్యక్తి మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.