Tamil Film Connection With Aamir : తమిళ సినిమాలు హిందీలోకి రీమేక్ అవ్వడం కొత్తేమీ కాదు. అలా రీమేక్ అయ్యి భారీ హిట్ అందుకున్న చిత్రాలూ చాలానే ఉన్నాయి. అయితే బడ్జెట్ కన్నా 20 రెట్లు ఎక్కువ కలెక్షన్లు సాధించిన ఓ కోలీవుడ్ మూవీ తాజాగా హిందీలో రీమేక్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏది? అందులో నటీనటులు ఎవరు? తదితర విషయాలు తెలుసుకుందాం.
ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అందుకున్న చిత్రం 'లవ్ టుడే'. నేటితరం యువతీయువకుల ప్రేమ కథతో దీనిని రూపొందించారు. రూ.5కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 2022లో రిలీజై రూ.100 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పుడిదే సినిమాకి రీమేక్‌గా 'లవ్యాపా' తెరకెక్కింది. అద్వైత్ చందన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా, ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అక్కడి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఆమిర్ ఖాన్ కనెక్షన్
దేశంలో అత్యధిక శాతం లాభాలను తెచ్చిపెట్టిన ఈ సినిమాకు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌కు ఓ దగ్గరి కనెక్షన్ ఉంది. ఇందులో ఆయన తనయుడు జునైద్ మెయిన్ లీడ్‌గా నటించారు. హీరోయిన్గా దివంగత నటి శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ నటించారు. గ్రుష కపూర్, అశుతోశ్ రాణా, తన్వికా పర్లికర్, కికు శారద, దేవిశి మందన్, ఆదిత్య కుల్ శ్రేష్ట్, నిఖిల్ మెహతా తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు.
ఇద్దరు బాలీవుడ్ స్టార్ల వారసులు కలిసి నటించడం వల్ల 'లవ్యాపా' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2023లో విడుదలైన 'ది ఆర్చిస్'తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు ఖుషీ కపూర్. అది డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. ఇందులో ఆమె నటనతో ఆకట్టుకున్నారు. ఖుషీ నటించిన రెండో చిత్రమే 'లవ్ యాపా'. గతేడాది విడుదలైన 'మహారాజ్ 'తో జునైద్ ప్రేక్షకులను అలరించారు. వీరిద్దరి మొదటి సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి.
ఫ్యామిలీ అంతా స్టార్లే- కానీ గోవాలో టీషర్ట్స్ విక్రయం- కట్ చేస్తే ఇప్పుడు పాపులర్ హీరోగా!
రూ.74 రెమ్యూనరేషన్ కోసం సినిమాల్లోకి వచ్చిన స్టార్ కిడ్ - కట్ చేస్తే ఇండస్ట్రీలో టాప్ హీరో ఈయనే!