ETV Bharat / sports

ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్స్​ బుకింగ్ షురూ- ధర ఎంత? ఎలా కొనాలి? - CHAMPIONS TROPHY 2025 TICKETS

ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ల విక్రయం - ఎలా కొనుగోలు చేయాలంటే?

Champions Trophy Tickets
Champions Trophy Tickets (Associated PRess)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2025, 3:16 PM IST

Champions Trophy Tickets : ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఐసీసీ టోర్నీ జరగబోతోంది. ఈ టోర్నీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇస్తుండగా, భారత్‌ ఆడే మ్యాచులన్నీ దుబాయ్‌ వేదికగా జరగనున్నాయి. అయితే దుబాయ్​లో భారత్ ఆడనున్న మూడు లీగ్ మ్యాచ్ లు, అలాగే సెమీ ఫైనల్ మ్యాచ్ టికెట్ల విక్రయ వివరాలను ఐసీసీ వెల్లడించింది.

తొలి మ్యాచ్​లో బంగ్లాతో ఢీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుండగా, భారత్ మరుసటి రోజే(ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్​ను దుబాయ్​లో ఢీకొట్టనుంది. అలాగే ఫిబ్రవరి 23న దాయాది దేశం పాకిస్థాన్ ను, మార్చి 2న కివీస్​తో తలపడనుంది. ఒకవేళ భారత్ సెమీస్​కు చేరితే ఆ మ్యాచ్ కూడా దుబాయ్​లోనే మార్చి 4న జరగనుంది. ఈ మ్యాచ్ లను గ్రౌండ్​లో వీక్షించేందుకు ఫిబ్రవరి 3(సోమవారం) సాయంత్రం 4 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఐసీసీ తెలిపింది.

ఆన్ లైన్, ఆఫ్ లైన్​లో టికెట్లు
ఐకానిక్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్​ల కోసం అభిమానులు ఆన్​లైన్​లో టికెట్​లను బుక్ చేసుకోవచ్చు. జనరల్ స్టాండ్ టికెట్ ధరలు 125 దిర్హమ్ (భారత కరెన్సీలో దాదాపు రూ.3,000) నుంచి ప్రారంభమవుతాయి. ఫిజికల్ టికెట్స్ కూడా ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ఇవి పాకిస్థాన్​లోని 26 నగరాల్లోని 108 టీసీఎస్ సెంటర్లలో లభించనున్నాయి. దుబాయ్​లో మొదటి సెమీ ఫైనల్ ముగిసిన తర్వాత మార్చి 9న జరగబోయే ఫైనల్ టికెట్లు విడుదల అవుతాయి.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనుంది. 8 జట్లు 15 మ్యాచ్​ల్లో తలపడనున్నాయి. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ, భారత్ ఆడే మ్యాచులన్నీ హైబ్రిడ్ మోడల్​లో దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఒకవేళ భారత్‌ సెమీస్‌, ఫైనల్​కు చేరినా ఆ మ్యాచ్​లన్నీ దుబాయ్​లోనే జరుగుతాయి.

భారత్ ఆడే మ్యాచ్​లు
ఫిబ్రవరి 20 : బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా (దుబాయ్)
ఫిబ్రవరి 23 : పాకిస్థాన్ వర్సెస్ ఇండియా (దుబాయ్)
మార్చి 2: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా (దుబాయ్)
మార్చి 4 : సెమీ ఫైనల్- 1 (భారత్ అర్హత సాధిస్తే దుబాయ్​లో)
మార్చి 9 : ఫైనల్ (లాహోర్) (భారత్ అర్హత సాధిస్తే దుబాయ్​లో)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.