SSMB29 Story Update : సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ SSMB29 మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సినిమాను కూడా డిఫరెంట్ వరల్డ్‌లో హైలెట్ అయ్యేలా కథను సిద్ధం చేసిన్నట్లు ఇప్పటికే ఆయన పలుమార్లు తెలిపారు! దీంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఫస్ట్ టైమ్ ఆ జోనర్లో!
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. SSMB29 మూవీ కంప్లీట్ అడ్వంచర్ జోనర్లో ఉంటుందని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇండియాలో ఇలాంటి కథతో మూవీ రాలేదని అన్నారు. అలాగే మహేష్ బాబు కెరీర్లో కూడా ఫస్ట్ టైమ్ ఆ జోనర్లో సినిమా చేస్తున్నారని విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.
చాలా కసరత్తు చేసి రాశాం!
సినిమా కథ సిద్ధం చేసుకున్నప్పుడు మహేశ్ అడ్వంచర్ జోనర్లో ఇది వరకు సినిమాలు చేశాడా అనేది ఒకటికి రెండు సార్లు చూసుకున్నామని అన్నారు. మూవీ స్టోరీ కాంటెంపరరీలోనే ఉంటుందని, కథపైన చాలా కసరత్తు చేసి రాశామని అన్నారు. ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో ఇలాంటి జోనర్ లో సినిమా వచ్చిందా లేదా అనేది చూసుకొని రెడీ చేయడం జరిగిందని అన్నారు.
కచ్చితంగా ఇదొక సరికొత్త అడ్వెంచర్ ఎక్స్ పీరియన్స్ ని ఆడియన్స్‌ను అందిస్తుందని విజయేంద్ర ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని కథను డెవలప్ చేసిన కూడా కథని మహేష్ బాబు క్రేజ్ డామినేట్ చేయదని అన్నారు. అలా చేస్తే సినిమా ఆడియన్స్‌కు మూవీ రీచ్ అవ్వదని తెలిపారు. కథాబలంతోనే మూవీస్ సక్సెస్ అవుతాయని, SSMB 29కి కూడా అదే బలం ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయ్యింది. ప్రియాంక చోప్రా ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. కెన్యాలో మెజారిటీ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ లొకేషన్స్‌ను జక్కన్న ఫిక్స్ చేసినట్లు సమాచారం.