Nara Lokesh Review with Lawyers on Chandrababu Arrest ఉండవల్లికి చేరుకున్న.. లోకేశ్! చంద్రబాబు అరెస్టుపై న్యాయవాదులతో సమీక్ష! - చంద్రబాబు అరెస్ట్ పై నారా లోకేశ్
🎬 Watch Now: Feature Video
Published : Sep 9, 2023, 4:28 PM IST
Nara Lokesh Review with Lawyers on Chandrababu Arrest: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టుపై న్యాయవాదులతో లోకేశ్ సమీక్ష చేస్తున్నారు. చంద్రబాబును ఎక్కడికి తీసుకొస్తే అక్కడికి వెళ్లే యోచనలో లోకేశ్ ఉన్నారు. యువగళం పాదయాత్ర నుంచి ఉండవల్లికి చేరుకున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో కొనసాగిన లోకేశ్ పాదయాత్ర.. మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయలుదేరి వచ్చారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో తన తండ్రి వద్దకు వెళ్లాలని ఉదయం నుంచి లోకేశ్ ప్రయత్నించారు. పాదయాత్ర శిబిరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే లోకేశ్‌ను బయటకు కదలకుండా నిర్భందించారు... పోలీసుల తీరుతో రోడ్డుపై బైఠాయించి లోకేశ్ నిరసన వ్యక్తం చేశారు. జాతీయ జెండా పట్టుకుని నిరసన తెలిపారు. తండ్రిని చూసేందుకు కొడుక్కి పోలీసుల అనుమతి కావాలా అంటూ ప్లకార్డు ప్రదర్శించారు. మండుటెండలో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా బైఠాయించారు. సుమారు ఐదున్నర గంటల అనంతరం పోలీసులు లోకేశ్‌కు అనుమతి ఇవ్వడంతో ఆయన విజయవాడ పయనమయ్యారు. ఈ పరిణామాలతో యువగళం శిబిరం వద్ద ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.