ETV Bharat / state

నెలాఖరులో కొత్త ఉస్మానియా ఆసుపత్రికి శంకుస్థాపన : సీఎం రేవంత్‌ రెడ్డి - OSMANIA HOSPITAL IN GOSHAMAHAL

కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణంపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష - నెలాఖరులోగా ఆస్పత్రి శంకుస్థాపనకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

REVANTH REDDY
REVANTH REDDY ON OSMANIA HOSPITAL (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2025, 8:37 PM IST

Revanth Reddy on Osmania Hospital : గోషామహల్‌లో కొత్త ఉస్మానియా ఆసుపత్రికి నెలాఖరు వరకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో ఆయన సమీక్షించారు. గోషామహల్‌లో ప్రతిపాదిత స్థలానికి చెందిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా వైద్యారోగ్యశాఖకు బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రెండుశాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. ప్రతిపాదిత స్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు చెందిన నమూనా మ్యాప్‌లని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులు సూచించిన మ్యాప్‌లలో సీఎం పలు మార్పులు, చేర్పులు సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులుడేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలన్న ముఖ్యమంత్రి భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

భవిష్యత్తులో రహదారి విస్తరణ, ఫ్లైఓవర్ వంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లను రూపొందించాలని నిర్దేశించారు. అత్యాధునిక వసతులతో పాటు రోగుల సహాయకులు సేద తీరేందుకు గ్రీనరీ, పార్క్ సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకి ధీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

ఆసుపత్రికి అవసరమైన వివిధ విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు కూడా నిర్మించాలని సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, అన్ని సేవలు అక్కడే అందుబాటులో ఉండాలని సూచించారు. ఇప్పుడున్న ఉస్మానియా ఆస్పత్రి భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షిస్తామని మూసీ రివర్ డెవలప్​మెంట్​ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామని సీఎం గతంలోనే ప్రకటించారు.

ఉస్మానియా భవనం సురక్షితం కాదని, ఆసుపత్రికి పనికిరాదని రెండేళ్ల క్రితమే నిపుణుల కమిటీ తేల్చింది. భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ ఆసుపత్రికి కాకుండా ఇతర అవసరాలకే ఉపయోగించవచ్చని తెలిపింది. వారసత్వ కట్టడమైనందున ఉస్మానియా భవనానికి ఆర్కిటెక్ట్‌ పర్యవేక్షణలో మరమ్మతులు చేయవచ్చని సూచించింది. దీంతో ప్రభుత్వం కొత్త ఆసుపత్రి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది.

గోషామహల్​లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి - పేట్లబుర్జుకు పోలీస్​ స్టేడియం తరలింపు

'ఉస్మానియా భవనం ఆసుపత్రికి పనికి రాదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.