ETV Bharat / state

ఆధ్యాత్మిక సాధన ద్వారా వ్యాపారంలో అద్భుత విజయాలు అందుకోవచ్చు : యోగిని దీదీజీ - BUSINESS THROUGH SPIRITUAL PRACTICE

రామోజీ ఫిలింసిటీలో బ్రహ్మకుమారీల వ్యాపార విభాగం సదస్సు - పారిశ్రామిక వేత్తల్లో అంతర్గత శక్తులు వెలికితీయడమే లక్ష్యం - దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన పారిశ్రామికవేత్తలు

Ramoji Film City
Brahmakumari Business Unit Conference (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2025, 8:33 PM IST

Brahmakumari Business Unit Conference Ramoji Film City : మానవ జీవితంలో శాంతి, ప్రేమ, పవిత్రత, ఆనందం తీసుకురావడం లక్ష్యంగా పని చేస్తోంది బ్రహ్మకుమారీస్‌ సంస్థ. సాధారణంగా లాభార్జనే ధ్యేయంగా సాగే వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోనూ విలువలకు ప్రాధాన్యమిచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆ లక్ష్యంతో బ్రహ్మకుమారీస్‌ సంస్థ వ్యాపార విభాగం రామోజీఫిలింసిటీలో సదస్సు నిర్వహించింది.

వ్యాపార నిర్వహణలో మానవీయ, ఆధ్యాత్మిక కోణాలను జోడించడం ద్వారా అంతర్గత శక్తులను వెలికితీయాలని బ్రహ్మకుమారీల జనరల్‌ సెక్రటరీ బ్రిజ్‌మోహన్‌ భాయిజీ అన్నారు. ఆధ్యాత్మిక సాధన ద్వారా వ్యాపారంలో విజయాలు అందుకోవచ్చని ఆసంస్థ వ్యాపార విభాగం ఛైర్‌పర్సన్‌ యోగిని దీదీజీ తెలిపారు.

ఆధ్యాత్మిక సాధన ద్వారా వ్యాపారంలో విజయాలు అందుకోవచ్చు : యోగిని దీదీజీ (ETV Bharat)

"మనలోని అంతర్గత శక్తితో వ్యాపార రంగంలో సక్సెస్ అవుతాం. ఆధ్యాత్మిక శక్తితోనే మనలోని అంతర్గత శక్తిని ప్రేరేపించుకోగలం. అప్పుడే వ్యాపారంలో విజయాలు అందుకోవచ్చు" - యోగిని దీదీజీ, బ్రహ్మకుమారీస్‌ వ్యాపార విభాగం ఛైర్‌పర్సన్‌

ఇక్కడకు వచ్చిన పారిశ్రామిక వేత్తలు అందరు మాలో ఇంకా ఇన్ని లోపాలు ఉన్నాయా?, మేం సరిగ్గా ప్లానింగ్ చేసుకోవడం లేదా?, అని తెలుసుకున్నారు. మెడిటేషన్​తో శక్తివంతమైన, విజయవంతమైన బిజినెస్​మెన్ కావడానికి ఈ జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది- జస్టిస్‌ ఈశ్వరయ్య, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి

"ఇది చాలా మంచి కార్యక్రమం, ప్రస్తుత మన పనులకు ఈ స్పీచ్​లు విన్న తరువాత 70,80 ఏళ్ల వరకు మనం ఎన్నో రకాల పనులు చేయాలన్న ఉత్సాహం కలుగుతుంది" - ఎన్‌. లింగరాజు, ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల ప్రిన్సిపాల్

వ్యాపార, పారిశ్రామిక వేత్తల కోసం బ్రహ్మకుమారీల సంస్థ రామోజీ ఫిలింసిటీలో నిర్వహించిన సదస్సుకు దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు. రామోజీ ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్‌ ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సదస్సు తమకెంతో ఉపయోగపడిందని.. కార్యక్రమానికి హాజరైన వ్యాపారవేత్తలు, నిపుణులు ఆనందం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.