Police Seized 300kgs Ganza In Abdullapurmet : రాష్ట్రంలో గంజాయి, మత్తుపదార్థాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ అక్రమ రవాణాదారులు మాత్రం ఏదో విధంగా వాటిని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో గురువారం అధికారులు భారీగా గంజాయి సీజ్ చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు. కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రూ.కోటి విలువైన 300 కిలోల గంజాయి సీజ్ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు తరలించే క్రమంలో ముందస్తు సమాచారంతో మహేశ్వరం ఎస్వోటీ సిబ్బంది, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. అధికారుల తనిఖీల్లో భాగంగా 300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కంటైనర్‌ను కూడా సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు వివరించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
"అహ్మద్ గులాబ్ షేక్ అనే వ్యక్తి పుణెలో పుట్టి పెరిగి అక్కడే చదువుకొని డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహారాష్ట్రలోని పుణెలో ఉన్న వైభవ్, దేవా అనే వ్యక్తులకు ఈ మత్తు పదార్థాలను ఇతను అమ్ముతున్నాడు. దీని ద్వారా మత్తు పదార్థాలను మొత్తం ఆ ప్రాంతంలో విస్తరిస్తున్నారు. గులాబ్ షేక్ వారికి గంజాయి అమ్మిన ప్రతిసారి రూ.3 లక్షలు ఇస్తున్నారు. ఇతనికి గంజాయి సోర్స్‌గా ఉన్న బుజ్జిబాబు అనే వ్యక్తిని కూడా గుర్తించడం జరిగింది" -సుధీర్ బాబు, రాచకొండ సీపీ
రెచ్చిపోతున్న గంజాయి అక్రమ రవాణా ముఠా : రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా మత్తుపదార్థాల మాట వినపడకూడదని కూడా అధికారులకు సూచించారు. మరోవైపు పోలీసులు కూడా సీఎం ఆదేశాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ గంజాయి ముఠాలు మాత్రం రెచ్చిపోతున్నాయి. మత్తపదార్థాలను గుట్టుగా తరలిస్తున్న, సరఫరా చేస్తున్న ఎన్నో ముఠాలను పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో గంజాయి మత్తు! - బానిసలుగా మారుతున్న విద్యార్థులు!!
VIRAL VIDEO : గంజాయి తరలిస్తుండగా అడ్డుకున్న పోలీస్ - బైక్‌తో ఢీకొట్టి పరారైన దుండగులు