Telangana Govt revokes Game Changer ticket price hike : ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. టికెట్ రేట్ల పెంపు విషయంలో ఈ సినిమాకు ఇచ్చిన ప్రత్యేక వెసులుబాటును ఉపసంహరించుకుంటున్నట్టు ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం గేమ్ ఛేంజర్ టికెట్ ధరలు, అదనపు షోలకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. తెలంగాణలో ఇక నుంచి తెల్లవారుజామున ప్రత్యేక షోలకు అనుమతి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ ఛేంజర్. ఈ మూవీ టీం విజ్ఞప్తి మేరకు సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ సర్కారు అనుమతినిచ్చింది. సినిమా రిలీజ్ రోజు జనవరి 10న (శుక్రవారం) ఉదయం 4 గంటల నుంచి 6 షోలకు పర్మిషన్ ఇచ్చింది. రిలీజ్ రోజు సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్‌లో అదనంగా రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.150 పెంచుకునేందుకు వీలు కల్పించింది. జనవరి 11 నుంచి 19 (9 రోజులు) వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
'గేమ్ ఛేంజర్'లో నటనకు రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు రావాలి : సుకుమార్ ఫస్ట్ రివ్యూ
రూ. 10 కోట్ల బడ్జెట్, 6 రోజుల షూట్!: 'గేమ్ ఛేంజర్' నానా హైరానా సాంగ్ విశేషాలివే