ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో T20 సిరీస్​కు జట్టు ప్రకటన- షమీ రీఎంట్రీ, కానీ SRH ప్లేయర్​కు నో ఛాన్స్​! - IND VS ENG T20S 2025

షమీ రీ ఎంట్రీ, ఆల్​రౌండర్​కు ప్రమోషన్- కానీ, SRH ప్లేయర్​కు నో ఛాన్స్​!- ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​కు జట్టు

Ind vs Eng T20s 2025
Ind vs Eng T20s 2025 (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 11, 2025, 8:48 PM IST

Shami Comeback : టీమ్ఇండియా ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. జనవరి 22 నుంచి ఇంగ్లాండ్​తో జరగనున్న టీ20 సిరీస్​కు బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో సెలక్టర్లు షమీకి చోటు కల్పించారు. కెప్టెన్ సూర్యకుమార్ నాయకత్వంలో, 15మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ఇక 2023 వరల్డ్​కప్​లో గాయపడ్డ షమీ ఆ తర్వాత టీమ్ఇండియాకు దూరమయ్యాడు. కొంత కాలం ఎన్​సీఏలో కోలుకున్నప్పటికీ పూర్తి స్థాయి ఫిట్​నెస్ సాధించనందున సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇక ఇటీవల కాలంలో షమీ సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హరారే టోర్నీల్లో రాణించి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో షమీ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడింది. కాగా, దాదాపు 14నెలల తర్వాత షమీ ఈ సిరీస్​తో టీమ్ఇండియా తరపున బరిలోకి దిగనున్నాడు.

మళ్లీ నిరాశే
యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్​కు మళ్లీ నిరాశే మిగిలింది. ఈ సిరీస్​తో అయినా టీమ్ఇండియాలో రీ ఎంట్రీ ఇస్తాడని అనుకున్నా సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. 2023 డిసెంబర్​లో ఇషాన్ కిషన్ టీమ్ఇండియా తరఫున ఆఖరి మ్యాచ్​ ఆడాడు. ఇక 2025 ఐపీఎల్​కు గాను అతడిని సన్​రైజర్స్ హైదరాబాద్ వేలంలో రూ.11.40 కోట్లకు కొనుగోలు చేసింది.

వాళ్లకూ నో ఛాన్స్
స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్, శివమ్ దూబేను కూడా సెలక్టర్లు దూరం పెట్టారు. పంత్ స్థానంలో శాంసన్, ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్లుగా ఎంపిక అయ్యారు. ఇక దూబేకు బదులుగా ఇటీవల బోర్డర్ గావస్కర్​లో అదరగొట్టిన తెలుగు తేజం నితీశ్ రెడ్డివైపే మేనేజ్​మెంట్ మొగ్గు చూపింది.

ఆల్​రౌండర్​కు ప్రమోషన్
యువ ఆల్​రౌండర్ అక్షర్​ పటేల్​కు ప్రమోషన్ లభించింది. ఈ సిరీస్​లో అతడు వైస్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. ఇక 5 టీ20, 3 వన్డే మ్యాచ్​ల సిరీస్​ కోసం ఇంగ్లాండ్ భారత్​లో పర్యటించనుంది.

టీ20 సిరీస్​కు భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ , వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్)

టీ20 సిరీస్ షెడ్యూల్

  • తొలి టీ20- జనవరి 22- కోల్‌కతా
  • రెండో టీ20- జనవరి 25- చెన్నై
  • మూడో టీ20- జనవరి 28- రాజ్‌కోట్‌
  • నాలుగో టీ20- జనవరి 31- పుణె
  • ఐదో టీ20- ఫిబ్రవరి 2- ముంబయి

ఒక్క సెంచరీతో ఐదు రికార్డులు- తొలి భారత బ్యాటర్​గా అరుదైన ఘనత

'వాళ్లిద్దరిని తీసుకోకపోవడం సిగ్గుచేటు' - BCCIపై క్రీడాభిమానుల ఆగ్రహం! - IND vs BAN T20 Squad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.