Congress CM Candidate MLA Seethakka : ' ఎమ్మెల్యే సీతక్క మా సీఎం'.. రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ - సీఎం పోస్టుపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 11, 2023, 10:01 AM IST

Revanth Reddy on Congress CM Candidate : ఉప ముఖ్యమంత్రి కాదు.. సందర్భం వస్తే ఎమ్మెల్యే సీతక్క ముఖ్యమంత్రి అయినా కావచ్చని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వేరు వేరు కాదని అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడేట్లు ఉండాలని సూచించారు. 18 శాతం జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో భట్టి విక్రమార్క ముఖ్యమంత్రిగా ప్రతిపాదన తెరపైకి వచ్చిందని, ఎస్టీ అయిన సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడుగా మల్లిఖార్జున ఖర్గే ఉన్నారని.. ఆయణ్ను చూస్తేనే కాంగ్రెస్‌ ఏ దిశలో చొరవ చూపుతుందో అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికే నలుగురు ముఖ్యమంత్రులు ఉండగా.. అందులో ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం మాత్రమే ఓసీ అని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుని ఏఐసీసీ స్థాయిలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.