హైటెన్షన్​ విద్యుత్​ వైర్లలో చిక్కుకున్న పారాగ్లైడర్​ - గోవర్ధన మథుర జిల్లా పారాగ్లైడింగ్​ ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 16, 2022, 4:13 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో పెను ప్రమాదం తప్పింది. అనుమతి లేకుండా వెళ్తున్న ఓ పారాగ్లైడర్​ ఒక్కసారిగా హైటెన్షన్​​ విద్యుత్​ వైర్​లలో చిక్కుకుంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. పారాగ్లైడర్​​ విద్యుత్​ తీగలకు తగిలిన సమయంలో కరెంట్​ లేనందున పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం సాయంత్రం మథుర జిల్లాలోని గోవర్ధన్​ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన రహదారిపై ఈ ఘటన జరిగింది. ఆ పారాగ్లైడర్​లో ఓ మహిళతోపాటు పైలట్​ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ రహదారిపై కొంత సమయం పాటు రాకపోకలు నిలిచిపోయాయి.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.