Viswambhara Movie Shooting : మెగాస్టార్ చిరంజీవి, 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'విశ్వంభర'. సోషియో ఫ్యాంటసీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలై టీజర్ మెగా అభిమానుల్లో తెగ ఆసక్తి పెంచింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి నెట్టింట ఓ రూమర్ తెగ ట్రెండ్ అవుతోంది. అదేంటంటే?
భారీ సీక్వెన్స్‌లో చిరు
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా చిరుతో ఓ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. ఓ భారీ సెట్లో 600 మంది డ్యాన్సర్లతో చిరు స్టెప్పులు వెయ్యనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. శోభా మాస్టర్ ఆ పాటకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారట. ఇక ఈ సాంగ్ షూట్ తర్వాతనే మిగతా షెడ్యూల్‌ను కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం.
ఆ సీన్ హైలైట్
ఇదిలా ఉండగా, ఈ మూవీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సీక్వెన్స్‌ను సుమారు 26 రోజుల పాటు షూట్ చేశారట. ఇక 54 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని కూడా మూవీ టీమ్ ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం ముందే సీక్వెన్స్ షూటింగ్ జరిగింది. గతంలో దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అయ్యాయి.
ఇక 'విశ్వంభర' సినిమా విషయానికొస్తే - సీనియర్ హీరోయిన్ త్రిష, అషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, కునాల్ కపూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ జానర్లో 'విశ్వంభర' తెరకెక్కుతోంది. 'జగదేకవీరుడు అతిలోకసుందరి', 'అంజి' తర్వాత చిరు నుంచి ఈ జానర్లో వస్తున్న సినిమా ఇది.
మరోవైపు చిరు ఇటీవలే 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో ఓ చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. నాని సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కూడా పూర్తి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో సాగనున్నట్లు సమాచారం. అయితే అనిల్ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది.
'విశ్వంభర'లో మరో స్టార్ హీరోయిన్!- ఇదిగో క్లారిటీ!
దసరా ట్రీట్ - అంతకుమించి అనేలా 'విశ్వంభర' విజువల్ వండర్ టీజర్