బ్యాంకులో దొంగకు చుక్కలు చూపించి జైలుకు పంపిన మహిళా మేనేజర్​ - రాజస్థాన్​లో బ్యాంక్​ చోరీకి యత్నం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 18, 2022, 6:50 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

రాజస్థాన్​ శ్రీగంగానగర్​లోని రాజస్థాన్​ మరుధర గ్రామీణ బ్యాంకులో చోరీకి వచ్చి దొరికిపోయాడు ఓ దొంగ. శనివారం పదునైన ఆయుధంతో లోపలకు ప్రవేశించిన దొంగను బ్యాంకు సిబ్బంది చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కత్తి పట్టుకుని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగిన ఆ దొంగకు ఏ మాత్రం భయపడని బ్యాంకు మేనేజర్‌ పూనమ్‌ గుప్తా ఓ కత్తెరను పట్టుకుని ఎదురుదాడికి దిగారు. దీంతో పరుగు లంకించుకున్న దొంగను ఇతర సిబ్బంది కలిసి పట్టుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ బ్యాంకు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దొంగను ద్వాడా కాలనీకి చెందిన 29 ఏళ్ల లావిశ్​గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగను విచారిస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.