Telangana Inter Exams 2025 : వార్షిక పరీక్షల షెడ్యూల్ రాగానే ప్రతి ఒక్క విద్యార్థిలో అలజడి మొదలవుతుంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ సంవత్సరం విషాదకర ఘటనలు జరుగుతున్నాయి. ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సన్నద్ధం అయితే ఒత్తిడి దరిచేరదని, ఎక్కువ మార్కులు వస్తాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచనలు చేస్తున్నారు. పరీక్షలు బాగా రాయలేమని, ఫెయిల్ అవుతామని, కెరీర్ ఏమి అవుతుందోననే భయం వీడాలని వారు అంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో సతమతం అవుతున్న విద్యార్థులకు టెలిమానస్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు టోల్‌ఫ్రీ 14416 అందుబాటులోకి తెచ్చింది.
90 రోజుల ప్రణాళిక : -
- ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.
- వచ్చే నెల 3 నుంచి 22 వరకు ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి.
- మార్చి 5 నుంచి 25 వరకు వార్షిక పరీక్షలు జరుగనున్నాయి.
- నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇప్పటికే 90 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం ఆ ప్రణాళిక అమలు చేస్తున్నారు.
- మొదటగా వెనుకబడిన విద్యార్థులను గుర్తిస్తారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
ఫోన్ కొట్టు - పరిష్కారం పట్టు : -
- విద్యార్థులను మంచి మార్గంలో నడిపించేలా కౌన్సెలింగ్ ఇచ్చే టెలిమానస్ కార్యక్రమంపై ప్రచారం చేయాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.
- జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు టోల్‌ఫ్రీ నంబరు ఏ విధంగా సహాయపడుతుందో విద్యార్థులకు స్పష్టంగా వివరించాలి.
- భయం, ఒత్తిడి తొలగించుకోవడానికి, మానసిక ఆరోగ్య సమస్యలు పరిష్కరించుకోవడానికి, ఒంటరితనం నుంచి బయటపడేందుకు, ఆత్మ విశ్వాసం పెంపొందించుకునేందుకు, సామాజిక మాధ్యమాలను దూరం పెట్టేందుకు మానసిక నిపుణులు, విద్యావేత్తలు సలహాలు, సూచనలు ఇస్తారు.
- విద్యార్థులు అడిగిన ఎలాంటి ప్రశ్నలకు అయినా మానసిక నిపుణులు, విద్యావేత్తలు ఓపికగా జావాబులు ఇస్తారు.
- సమయపాలన, చదువు ప్రణాళిక, ఒత్తిడి నియంత్రణ గురించి వారు పూర్తిగా వివరిస్తారు.
- నిద్రలేమి, ఆందోళన మొదలైన సమస్యలల్ని విద్యార్థుల మాటల్లో గుర్తిస్తారు. అనంతరం సూచనలు చేస్తారు. విద్యార్థులకు పరీక్షల భయం పోగొట్టి మనోధైర్యం నింపుతారు.
చదివింది గుర్తుండటం లేదా? - ఈ టిప్స్ పాటించండి - ఇక మీరే క్లాస్ టాపర్!
మీ టెన్త్ సర్టిఫికెట్లో స్పెల్లింగ్ తప్పు పడిందా? - ఏం చేయాలో తెలుసా?