Cricketer Showered With Money : భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు ప్రతి గ్రామంలో క్రికెట్ టోర్నీలు, పోటీలు జరుగుతుంటాయి. తాజాగా థానేలో నిర్వహిస్తున్న స్థానిక క్రికెట్ పోటీలకు దేశ స్థాయిలో గుర్తింపు లభించింది. ఎందుకు అని ఆలోచిస్తున్నారా? వైరల్ క్రికెట్ మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం.ట
'ఫోర్లు, సిక్సుల వర్షం కురిసింది' వంటి కామెంటరీ క్రికెట్ లవర్స్‌కు సుపరిచితమే. ఏ బ్యాటర్ అయినా ప్రత్యర్థి జట్టుపై బౌండరీలతో విరుచుకుపడితే ఈ మాటలు ఉపయోగిస్తారు. ఇలానే థానేలో జరిగిన స్థానిక క్రికెట్ మ్యాచ్‌లో ఓ బ్యాటర్ సిక్సులు, ఫోర్లతో అలరించాడు. అతడి బ్యాటింగ్ ఫిదా అయిపోయిన ఓ అభిమాని గ్రౌండ్‌లో కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భివాండి జిల్లా కొంగావ్, కళ్యాణ్-భివాండి హైవే సమీపంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ స్టేడియంలో 70-70 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలను బీజేపీ కల్యాణ్ నగర అధ్యక్షుడు వరుణ్‌పాటిల్ నిర్వహించారు. కళ్యాణ్ లోక్‌సభ సభ్యుడు డాక్టర్ శ్రీకాంత్ షిండే టోర్నీని ప్రారంభించారు. ఓ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఓ బ్యాటర్ కొట్టిన అద్భుతమైన షాట్‌లను చూసిన ప్రేక్షకుడు మైదానం వైపు పరుగులు తీశాడు. బ్యాట్స్‌మెన్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి రూ.500 నోట్లను తీసి అతడిపైకి విసిరాడు. ఇది చూసి మైదానంలో ఉన్న ఆటగాళ్లు అందరూ షాక్ అయ్యారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరికి క్రికెట్‌పై ఉన్న అభిమానం, ఇష్టం కనిపించింది. మరి కొందరు కరెన్సీ నోట్లను అవమానించినట్లు భావించారు. అతడపై చర్యలు తీసుకోవాలని కోరారు.
నోట్లు విసిరింది ఎవరంటే?
మ్యాచ్ చివరి రోజు పవన్ అనే బ్యాటర్ భారీ షాట్లు ఆడుతూ క్రీజులో ఉండగా 35 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్‌ను చూసిన ప్రేక్షకుడు వికాస్ భోయిర్ క్రికెటర్‌పై కరెన్సీ నోట్లను విసిరాడు. ఇంకొందరు ప్రేక్షకులు కూడా డబ్బులు వసూలు చేసి క్రికెటర్ పవన్ కు ఇచ్చేందుకు మైదానంలోకి పరుగు తీయడం గమనార్హం.