ETV Bharat / spiritual

ఆ రాశి వారి ఆదాయం నేడు పదింతలు జంప్​- విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం! - DAILY HOROSCOPE IN TELUGU

2025 ఫిబ్రవరి 8వ తేదీ (శనివారం) రాశిఫలాలు

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2025, 2:11 AM IST

Horoscope Today February 8th 2025 : 2025 ఫిబ్రవరి 8వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సువర్ణావకాశం నేడు మీ ఇంటి తలుపు తట్టవచ్చు. అన్ని రంగాలలో శుభ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పదింతలు పెరుగుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేస్తారు. వ్యాపారంలో గొప్ప అవకాశాలు అందుకుంటారు. లక్ష్య సాధన కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. వృత్తి వ్యాపారాలలో పరిస్థితులు అంచనా వేయడంలో విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమవుతుంది. పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు బాధిస్తాయి. ప్రతికూల ఆలోచనలు వీడి ముందడుగు వేయడం భవిష్యత్తుకు మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరులకు మీపై దురభిప్రాయం కలిగేలా ప్రవర్తించవద్దు. వృత్తి ఉద్యోగావ్యాపారాలలో కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మనోధైర్యాన్ని కోల్పోకండి. సన్నిహితుల సహకారంతో క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ప్రతికూల పరిస్థితి ఉన్నప్పటికీ మీ కృషి, కఠిన శ్రమ కారణంగా మంచి ఫలితాలు అందుకుంటారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యం అంతగా సహకరించకపోవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరుల సహకారంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అధిక పనిభారం కారణంగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కుటుంబ కలహాల కారణంగా ఈ రోజంతా చికాకుగా ఉంటుంది. కుటుంబసభ్యులతో వాదనలు ఘర్షణల్లో మౌనంగా ఉండండి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో సమస్యలు ఎదురు కావచ్చు. సందర్భానుసారం నడుచుకుంటే మేలు. ఆర్ధిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోండి. ఓ వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శివారాధన శ్రేయస్కరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అధిక పని వత్తిడి వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. మిత్రుల సహాయంతో ఆటంకాలను అధిగమిస్తారు. మనోబలంతో ముందుకు సాగితే విజయం సిద్ధిస్తుంది. ఒక వార్త విచారం కలిగిస్తుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి కలిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. నవగ్రహ పదక్షిణలు చేయడం ఉత్తమం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీవ్రమైన పనిఒత్తిడి ఉన్నప్పటికినీ మెరుగైన ఆర్ధిక ప్రయోజనాలు ఉండడంతో సంతోషంగా ఉంటారు. పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలకు సంబంధించి మీ ప్రతిపాదనలు ఆమోదం పొందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అన్నింటా ముందుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయి. ఉన్నతాధికారులు సహకరిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. కనకధారా స్తోత్రం పఠించడం మంచిది.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తినిపుణులు, వ్యాపారులకు ఈ రోజు అనుకూలమైన రోజు. సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సన్నిహితుల సూచనలు పాటించడం ఉత్తమం. ఉద్యోగంలో నిర్లక్ష్య వైఖరి తగదు. వ్యాపారంలో ఆటంకాలు ఇబ్బంది పెడతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శని స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ప్రయత్న కార్యసిద్ధి ఉంది. ఉద్యోగావ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కీలమైన నిర్ణయాల విషయంలో తెలివిగా వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తగదు. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీరామ రక్షాస్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. కొత్త వ్యక్తులను కలుస్తారు. వృత్తి పరంగా సామాజిక పరిధి పెరుగుతుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆదాయవ్యయాలు సరిసమానంగా ఉంటాయి. కొన్ని సంఘటనలు నిరుత్సాహం కలిగించవచ్చు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.