Akhanda 2 First Look : 'డాకు మహారాజ్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు 'అఖండ 2 : తాండవం'తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే మేకర్స్ బాలయ్య అభిమానుల కోసం ఓ స్వీట్ సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తున్నారట.
త్వరలోనే ఈ సినిమా నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల చివరిలో ఆ లుక్‌ను రివీల్ చేసే ప్లాన్స్‌లో ఉన్నట్లు సినీ వర్గాల మాట. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇక సినిమా విషయానికి వస్తే, 'అఖండ'కు సీక్వెల్‌గా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో బాలయ్య మరో నయా అవతార్‌లో కనిపించనున్నారట. రెండు భిన్నమైన పాత్రల్లో కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్యతో పాటు సంయుక్తా మేనన్, ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎం.తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబరు 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
హ్యాట్రిక్ హిట్స్
జనవరి 12న విడుదలైన 'డాకు మహారాజ్' మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' తర్వాత బాలయ్యకు ఇది వరుసగా నాలుగో హిట్ కావడం విశేషం.
హిట్ కాంబో :
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబోలో రూపొందుతున్న నాలుగో చిత్రం 'అఖండ-2'. ఈ ఇద్దరూ ఇప్పటికే 'లెజెండ్', 'సింహా', 'అఖండ' లాంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు 'అఖండ 2'పైన భారీ అంచనాలే ఉన్నాయి. పైగా బోయపాటి ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్, అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో తీర్చిదిద్దుతున్నారు.
మహా కుంభమేళాలో 'అఖండ 2' టీమ్ - కోట్లాది భక్తుల మధ్యలో షూటింగ్
'అఖండ 2' కోసం క్రేజీ సీక్వెన్స్ - ఫస్ట్ సీన్లోనే బాలయ్య సూపర్ ఫైట్!