Longest Hair In The World Male 2023 : అతడి జుట్టు పొడవు 4అడుగుల 9 అంగుళాలు.. ఎన్నో అవమానాలు దాటి ప్రపంచ రికార్డ్ - సిదక్‌దీప్ సింగ్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Sep 20, 2023, 1:22 PM IST
Longest Hair In The World Male 2023 : కనిపిస్తున్న ఈ శిరోజాలను చూసి కచ్చితంగా అమ్మాయనే అనుకున్నారు కదూ.. కానీ అక్షరాల అబ్బాయే. మీ కళ్లు మిమ్మల్ని మోసం చేసినా ఈ ఒత్తైన కురులను అల్లుకుంటూ కనిపించే వ్యక్తి అమ్మాయి కాదు. ముమ్మాటికీ అబ్బాయే.. ఒత్తైన కురులతో మహిళలు సైతం పెంచడానికి వీలుపడని విధంగా అత్యంత పొడవైన జుట్టు పెంచాడు ఈ బాలుడు. తన కురులను అంతాఇంతా కాకుండా ఏకంగా 4 అడుగుల 9.5 అంగులాల పొడవు పెంచి, ప్రపంచంలోనే పొడవాటి జుట్టు ఉన్న పురుషుడిగా గిన్నిస్ రికార్డు సాధించాడు. అంత ఏపుగా శిరోజాలు పెంచడానికి తన మత ఆచారాలే కారణమని వెల్లడించాడు.
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాకు చెందిన సిదక్‌దీప్ సింగ్ చాహల్ వయసు 15 ఏళ్లు. సిక్కు మత సంప్రదాయం ప్రకారం తలనీలాలు తొలగించడం నిషేధం కాబట్టే.. ఇంత పొడవాటి జుట్టు పెంచగలిగానని ఆ కుర్రాడు చెబుతున్నాడు. తన కురుల పోషణలో తన అమ్మ సహకారం ఎంతో ఉందని తెలియజేస్తున్నాడు. తన పేరు గిన్నిస్ రికార్డులో నమోదు కావడం తనకెంతో ఆనందంగా ఉందని.. తన జుట్టు చూసి స్కూల్లో స్నేహితులు ఎన్నో సార్లు అమ్మాయిలా ఉన్నావని ఎగతాళి చేసే వారని, ఆ అవమానాలన్నీ భరించినందుకు ఈ ఫలితం దక్కిందన్నాడు. నిజంగా ఇంతటి గుర్తింపు లభిస్తుందని తానెప్పుడూ ఊహించలేదని చెబుతున్నాడు.