హైవేపై 'ఫాస్ట్ & ఫ్యూరియస్'.. పోలీసుల సూపర్ ఛేజ్.. టైర్లు ఊడినా ఆగని లారీ! - పోలీసుల చేజింగ్ వీడియో హరియాణా
🎬 Watch Now: Feature Video
దిల్లీ-మంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై సినీ ఫక్కీలో లారీని ఛేజ్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. 32 ఆవులను అక్రమంగా తరలిస్తున్న లారీని 20 కిలోమీటర్లు వెంబడించారు. అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకన్నారు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లో జిల్లాలో దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై ఆవులను స్మగ్లింగ్ చేస్తున్న లారీని గుర్తించి.. గో రక్షక దళం పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. లారీని వెంబడించారు. పోలీసులను చూసి అప్రమత్తమైన స్మగ్లర్లు వేగం పెంచారు. ఘమ్డోజ్ టోల్‌ప్లాజా వద్ద బ్యారియర్‌ను ఢీకొట్టి ఆగకుండా లారీని పరిగెత్తించారు. కారులో లారీని వెంబడిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. రోడ్డుపై మేకులు చల్లారు. దీంతో లారీ ముందు టైరు ఒకటి పంక్చర్ అయింది. కొద్ది సేపటి తర్వాత రిమ్ నుంచి టైరు విడిపోయింది. అయినా రిమ్పై లారీ దూసుకెళ్లింది. హైవేపై 20 కిలోమీటర్లు ఛేజ్ చేసిన పోలీసులు.. బోంద్సీ ప్రాంతంలో లారీని అడ్డుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న 32 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల సూపర్ ఛేజింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.