Youtuber Local Boy Nani Arrested : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తున్న వాసుపల్లి నాని అలియాస్ యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ కంచర వీధికి చెందిన నాని ఇటీవల బెట్టింగ్ యాప్‌లపై ప్రచారం చేస్తూ ఒక వీడియోను రూపొందించారు. ఇలాంటి ప్రచారంతో యువతను తప్పుదోవ పట్టిస్తున్న నానిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 21న టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సహా కొంతమంది సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు.
అతడికి బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకుల నుంచి కొంత డబ్బు ముట్టినట్లుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. దీంతో శనివారం నానిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరికొంత మంది యూట్యూబర్‌లు కూడా బెట్టింగ్ యాప్‌లపై ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.
యమపాశాల్లా మారుతున్న మోసకారి బెట్టింగ్ యాప్‌లు - కట్టడి చేసేందుకు ఇంకేం చేయాలి?