రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం - అగ్నికి ఆహుతైన మూడు దుకాణాలు- ఘటనలో వెలుగుచూసిన కొత్త కోణం - Fire Accident in telangana
🎬 Watch Now: Feature Video
Published : Nov 11, 2023, 6:59 AM IST
|Updated : Nov 11, 2023, 1:30 PM IST
Fire Accident At Crackers Shop in Rajendranagar Today : రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ సన్‌సిటీ వద్ద క్రాకర్స్ దుకాణంలో మంటలు చేలరేగి.. పక్కనే ఉన్న దుర్గా భవాని ఫుడ్ జోన్‌కు వ్యాపించాయి. ఈ క్రమంలోనే ఫుడ్ జోన్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో.. మరో 3 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మొత్తం 4 దుకాణాల నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీనిపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Fire Accident in Rangareddy District : ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. మంటలు మరిన్ని దుకాణాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఫైర్ సిబ్బంది గోడలు బద్దలు కొట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. రాత్రి వేళ దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యామని స్థానికులు చెప్పారు. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీయగా.. కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు దుకాణం వద్దకు వచ్చి నిప్పు పెట్టినట్లు సీసీ కెమెరాలో నమోదైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.