సీఆర్ఆర్ న్యాయ కళాశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో జస్టిస్‌ నగేష్‌, జస్టిస్‌ హరినాథ్‌లకు ఘన సన్మానం - AP Telangana High Court Judges Honoured

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2023, 8:30 AM IST

Felicitation to Justice Nagesh and Justice Harinath​ in Vijayawada : జీవితంలో ఎదగడానికి దగ్గర దారంటూ ఏమీ ఉండదని.. నిరంతరం కష్టపడటం, కొత్త విషయాలు నేర్చుకోవడమే విజయ రహస్యమని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేశ్ అభిప్రాయపడ్డారు. శ్రమే ఆయుధమైతే విజయం బానిసవుతుందని ఆయన అభివర్ణించారు. ఏపీలోని విజయవాడ మినర్వా గ్రాండ్ హోటల్లో ఏలూరులోని సీఆర్ఆర్ న్యాయ కళాశాల పూర్వవిద్యార్థులు.. తమ సహచరులుగా ఒకనాడు విద్యనభ్యసించిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.నగేశ్ (Telangana High Court Judge Justice B.Nagesh), ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ (Andhra Pradesh High Court Judge Justice N.Harinath​)లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, విశ్రాంత న్యాయమూర్తి విజయలక్ష్మి హాజరయ్యారు. తెలుగు భాషంటే తనకు మమకారమని.. అందుకే తెలుగులో తొలిసారిగా జస్టిస్ నవీన్​తో కలిసి తీర్పునిచ్చినట్లు జస్టిస్ నగేశ్ గుర్తు చేశారు. న్యాయశాస్త్రం ప్రాక్టీస్ చేసేవారు అంకితభావంతో కష్టపడాలని, ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ కావాలని కోరారు. 

Felicitation to Telugu State High Court Judges under CRR Law College Alumni : ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాధ్ మాట్లాడుతూ.. సీఆర్ఆర్ న్యాయ కళాశాలలో చదివినప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ఏపీ హైకోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి మాట్లాడుతూ సీఆర్ఆర్ న్యాయ కళాశాల విద్యార్థులు ప్రతిభావంతులని.. ఎందరో ఉన్నత శిఖరాలు అధిరోహించారని కొనియాడారు. రెండు రాష్ట్రాల స్థాయిలోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ ఇద్దరు న్యాయమూర్తులు రాణించాలని కోరారు. పదవీ విరమణ చేసినప్పుడు మన గురించి ప్రజలు మంచిగా చెప్పుకోవాలని జస్టిస్ శేషసాయి అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.