మౌత్ ఆర్గాన్ వాయిస్తున్న ఏనుగు.. ఈ సంగీతం వినాల్సిందే! - elephant mouth organ playing
🎬 Watch Now: Feature Video
తమిళనాడు తిరుచిరాపళ్లిలోని ఎంఆర్ పలాయం ఎలిఫెంట్ క్యాంప్‌లో ఉన్న ఏనుగు.. సంగీతంలో తన ప్రావీణ్యాన్ని చూపిస్తోంది. తొండంతో మౌత్ ఆర్గాన్ వాయిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు, ఇక్కడి ఏనుగులను ప్రత్యేక శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నారు అధికారులు. వేసవి తాపం పెరుగుతున్న నేపథ్యంలో.. ఏనుగుల కోసం తాత్కాలిక నీటి కుంటలను నిర్మించారు. ప్రత్యేక షవర్లను ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ ఉన్న తొమ్మిది ఏనుగులు నీటిలో ఆటలాడుకుంటున్నాయి. తొండంతో నీళ్లు శరీరంపై చల్లుకుంటూ సేదతీరుతున్నాయి. ఇక్కడి సిబ్బంది సైతం వాటిని ఆహ్లాదంగా ఉంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాటిని సంరక్షిస్తున్నారు. ఏనుగుల కోసం అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. క్రమం తప్పకుండా ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. గడ్డితో పాటు వెలగపండ్లు, అరటి పండ్లు, మొక్కజొన్న, దుంపలు, పుచ్చకాయలను ఏనుగులు లాగిస్తున్నాయి. రోజుకు కిలోలకు కిలోలు ఆహారాన్ని ఆరగించేస్తున్నాయి. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఏనుగులను చూసి మురిసిపోతున్నారు.