మొక్కజొన్నలు తింటూ రోడ్డుకు అడ్డంగా నిలబడ్డ ఏనుగు.. గంటపాటు నిలిచిన వాహనాలు - ఏనుగు వీడియోలు
🎬 Watch Now: Feature Video
తమిళనాడులోని సత్యమంగళం ఫారెస్ట్ రిజర్వ్ ఏరియాలో ఏనుగు చేసిన పనికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమిళనాడు-కర్ణాటక రహదారికి అడ్డంగా ఏనుగు నిలబడటం వల్ల గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అంతకుముందే రోడ్డుపై ఓ లారీ ఆగిపోయింది. ఆ లారీ నిండా మొక్కజొన్న లోడ్ ఉంది. దీనిని గమనించిన ఏనుగు.. ఆ మొక్కజొన్నలు తింటూ రోడ్డుకు అడ్డంగా నిలబడింది. దీంతో రోడ్డుకు ఇరువైపుల వాహనాలు భారీగా బారులు తీరాయి. ఏనుగును అడవిలోకి పంపేందుకు వాహనదారుల తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయిన ఏనుగును అడవిలోకి పంపించలేకపోయారు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు.. చాకచక్యంగా వ్యవహరించి ఏనుగును అడవిలోకి పంపించారు. బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.
చెరుకు కోసం రోడ్డును నిర్భందించిన ఏనుగులు..
కొద్దికాలం క్రితం కూడా తమిళనాడు కర్ణాటక సరిహద్దులోని చామరాజనగర్ అనసూర్ చెక్‌పోస్టు వద్ద ఏనుగుల గుంపు తనిఖీ అధికారుల అవతారం ఎత్తాయి. ఎవరూ తమ నుంచి తప్పించుకోలేరు అన్న విధంగా చెక్‌పోస్టు వద్ద రహదారికి అడ్డంగా నిలుచున్నాయి. సుమారు 10 ఏనుగులు రోడ్డుకు అడ్డంగా గుమిగూడటం వల్ల వాహనదారులకు చుక్కలు కనిపించాయి. కొద్దిసేపు తర్వాత ఏనుగులు వచ్చిన దారినే వెళ్లిపోవడం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ రహదారిపై ఎక్కువగా చెరుకు పంటను తరలిస్తుంటారు. వాటిని తినేందుకే అక్కడికి ఏనుగుల వస్తున్నాయని అధికారులు తెలిపారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి