కాంగ్రెస్‌ అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు కేసీఆర్‌ యత్నం : డీకే శివకుమార్‌ - డీకే శివకుమార్​ తాజా వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2023, 12:16 PM IST

DK Shivakumar on Telangana Election Results 2023 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఆదివారం రోజున ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్​ పోల్స్ అన్నీ హస్తం పార్టీదే అధికారం అని ప్రకటించాయి. కారు రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొన్నాయి. అయితే ఈ అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

DK Shivakumar Accuses KCR Of Trapping Congress Candidates : ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై​ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తాజాగా బెంగళూరులో స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను ట్రాప్​ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని డీకే ఆరోపించారు. కేసీఆర్ స్వయంగా సంప్రదించిన విషయాన్ని పార్టీ అభ్యర్థులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. ఈ క్రమంలోనే తెలంగాణలో సునాయాసంగా హస్తం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.