10 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్.. వీడియో వైరల్ - దిల్లీ సరిహద్దు
🎬 Watch Now: Feature Video
delhi gurugram traffic jam: దిల్లీ-గురుగ్రామ్ సరిహద్దులో శనివారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గురుగ్రామ్‌లోని ఆంబియన్స్ మాల్ నుంచి దిల్లీ విమానాశ్రయం వరకు వాహనాలు రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి. దిల్లీ విమానాశ్రయం వద్ద భారీ క్రేన్ చెడిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే.. గురుగ్రామ్ పోలీసులు పచ్‌గావ్ నుంచి కెఎంపీ రోడ్, దుండహేరా సరిహద్దు మీదుగా దిల్లీకి వాహనాలను మళ్లించారు. ప్రజలు వేరే మార్గంలో దిల్లీకి వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.
Last Updated : Apr 10, 2022, 11:36 AM IST