Cow Music Therapy In Madhya Pradesh : గోవులకు చికిత్స సమయంలో మ్యూజిక్.. అందుకోసమేనట! - మధ్యప్రదేశ్ గ్వాలియర్ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Sep 20, 2023, 7:13 PM IST
Cow Music Therapy In Madhya Pradesh : మనకు చిన్న దెబ్బతగిలితేనే అల్లాడిపోతాం.. అలాంటిది మూగజీవులు పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే మధ్యప్రదేశ్‌లోని ఓ గోశాల యాజమాని గాయపడిన, జబ్బు చేసిన మూగ జీవులకు ఉపశమనం కలిగించేలా సంగీతం వినిపిస్తూ చికిత్స అందిస్తున్నారు. గ్వాలియర్‌లోని ఆదర్శ్ గోశాలలో రోజూ పదుల సంఖ్యలో అనారోగ్యంతో తన గోశాలకు వస్తున్న ఆవులకు మ్యూజిక్ థెరపీతో వాటి జబ్బులను నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గోవులు చికిత్స పొందుతున్నప్పుడు వాటికి ఉపశమనం కలిగించడానికి గోశాలలో వినసొంపైన సంగీతం వినిపిస్తారు. వైద్యులు చికిత్స అందిస్తున్నప్పుడు పక్కనే ఇద్దరు సిబ్బంది వేణుగానంతో గోవులకు సంగీతం వినిపిస్తారు. ఆ సంగీతం వింటూ.. గోవులు తమకు తగిలిన గాయాలను మరిచి నృత్యం చేస్తాయని అక్కడి సిబ్బంది చెబుతున్నారు.
రోజూ 15 నుంచి 20 గోవులకు ఇక్కడ చికిత్స అందిస్తామని.. ఆదర్శ్ గోశాల యాజమాని తెలిపారు. మ్యూజిక్ థెరపీ వల్ల అనారోగ్యంతో ఉన్న గోవులు బతికే అవకాశం 50 శాతం నుంచి 60 శాతానికి పెరిగిందని ఆయన వెల్లడించారు. అంతేకాదు యాజమానులు వదిలేసిన వందలాది గోవులకు ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నామని తెలిపారు.