ETV Bharat / state

పరీక్షల్లో మీ పిల్లలు ఫస్ట్​ ర్యాంక్​ సాధించాలా? - నిపుణుల సలహాలు, సూచనలు ఇవే! - HELPING KIDS COPE WITH EXAM STRESS

పరీక్షలు దగ్గరవుతుండటంతో ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు -పిల్లలను పరీక్షలకు సన్నద్ధం చేయడంలో తల్లిదండ్రుల పాత్ర - విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ వైద్యులు డా.సుబ్బారావు సూచనలు

Helping kids Cope With Exam Stress
Helping kids Cope With Exam Stress (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2025, 12:01 PM IST

Helping kids Cope With Exam Stress : పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పిల్లలు మంచి మార్కులు సాధించే విధంగా దగ్గరుండి చదివించాలని పిల్లలకన్నా తల్లిదండ్రులు తెగ హైరానా పడుతుంటారు. మార్చి నెల వస్తుందంటే చాలు పది, ఇంటర్, డిగ్రీ, ఇతర పోటీ పరీక్షలు ఉంటాయి. పిల్లలు పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్‌ సుబ్బారావు వివరించారు. ఆ వివరాలు మీ కోసం.

తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి ఇష్టమైన అంశాలను అందుబాటులో ఉంచి ప్రోత్సహించడం ఉత్తమం. లక్ష్యాలు విధించి మంచి ర్యాంకు తెచ్చుకోవాలని చెబితే పిల్లలు ఒత్తిడికి గురవుతారు. చదువుతో పాటు ఆటలు, పాటలు అన్నింటిలో ప్రావీణ్యం ఇప్పించి ఏ అంశంలో పట్టు సాధిస్తారో దాంట్లోనే ప్రోత్సహించడం అవసరం. అప్పుడు విజయం వారి సొంతమవుతుంది. పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా పేరెంట్స్ మాట్లాడితే వారు ఒత్తిడికి లోనవుతారు.

పిల్లలను చదువుకోమని మీరు టీవీ చూసినా : ముఖ్యంగా తల్లిదండ్రుల సమస్యలు స్టూడెంట్స్​కు తెలియకూడదు. పిల్లలు అన్ని విషయాలు గమనిస్తుంటారు. పిల్లలపై వారి ప్రవర్తన ప్రభావం కచ్చితంగా పడుతుంది. పిల్లలను చదువుకోమని మీరు టీవీ చూసినా నిత్యం ఏదో ఒక విషయంలో గొడవలు పడినా వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. చదువుపై సరిగా దృష్టి సారించలేరు.

'ఇటీవల ఒక విద్యార్థి నా దగ్గరికి వచ్చారు. నీరసంగా ఉంటూ అకస్మాత్తుగా పడిపోయేవాడు. పలువురు డాక్టర్లను సంప్రదించి చివరకు నా వద్దకు తీసుకొచ్చారు. విద్యార్థి ముందే తల్లిదండ్రులు నిత్యం గొడవలు పడేవారు. ఇది గమనించిన ఆ పిల్లాడు భయంతో నిద్రపోకపోవడం. ఆలోచనతో తినకుండా ఉండటం కారణంగా అనారోగ్యం పాలయ్యాడు. అది గమనించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ ఇచ్చిన కొద్దిరోజులకు అతను మామూలు వ్యక్తిగా మారాడు.

ప్రశాంత వాతావరణంలో ఉండేట్లుగా : కేవలం పరీక్షల సమయంలోనే కాకుండా నిత్యం ప్రశాంత వాతావరణంలో ఉంచే విధంగా చూసుకోవాలి. వారితో ఎక్కువ సమయం గడుపుతూ సామాజిక అంశాలతో పాటు కుటుంబ విషయాలు చర్చిస్తూ చిన్న చిన్న పనులు చెబుతూ బాధ్యతలు గుర్తు చేయాలి. తమ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ స్థాయికి తగినట్లు నడుచుకోమని సూచించాలి. కుటుంబ పరిస్థితిని గమనిస్తూ పెరిగినప్పుడే ఎలాంటి ఒత్తిడి లేకుండా వారు విజయం వైపు అడుగులు వేస్తారు.

పిల్లలు ఏం చేసినా ఇతరులతో పోల్చడమనేది సరికాదు. సాధించిన విజయాన్ని ప్రోత్సహిస్తూనే ఇంకోసారి బాగా ఉండాలని సూచించి విజయం సాధిస్తావు అనే నమ్మకాన్ని కల్గించడం అవసరం. దీంతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలి.

పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే - ఎలా రాయాలో మీకు తెలుసా?

లెక్కల భయం వీడండి - హిందీపై నిర్లక్ష్యం వలదండి - పదో తరగతిలో మంచి మార్కులు సాధించండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.