ETV Bharat / sports

ఛాంపియన్స్‌ ట్రోఫీ టీమ్ఇండియా హైలైట్స్- మూడో టైటిల్​పై రోహిత్ సేన గురి! - CHAMPIONS TROPHY 2025

మినీ వరల్డ్​కప్​లో భారత్ ఆల్​టైమ్ రికార్డ్​లు- టాప్ రన్ స్కోరర్, వికెట్ టేకర్ ఎవరంటే?

Champions Trophy India
Champions Trophy India (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 19, 2025, 12:20 PM IST

Champions Trophy Team India : ఛాంపియన్స్‌ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. టైటిల్ ఫేవరెట్​గా టీమ్ఇండియా బరిలోకి దిగుతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్ జట్టు అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తోంది. 2023లో వన్డే వరల్డ్​కప్ చేజార్చుకున్న టీమ్ఇండియా, ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీనైనా ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. గురువారం బంగ్లాదేశ్​తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ఇండియా హైలైట్స్, గణాంకాలపై ఓ లుక్కేద్దామా?

  • ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో భారత్ రెండుసార్లు విజేతగా నిలిచింది. 2002లో తొలిసారి సౌరభ్ గంగూలీ నాయకత్వంలో శ్రీలంకతో సంయుక్తంగా నెగ్గగా, 2013లో ధోనీ కెప్టెన్సీలో టైటిల్ దక్కించుకుంది
  • ఈ టోర్నీలో 7ఎడిషన్లలో కలిపి భారత్ 29 మ్యాచ్​లు ఆడింది. అందులో 18 విజయాలు ఉండగా, 8 మ్యాచ్​ల్లో ఓడింది. మరో మూడింట్లో ఫలితం రాలేదు
  • ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అత్యధిక స్కోరు 331-7 (50 ఓవర్లు). 2013 ఎడిషన్​లో సౌతాఫ్రికాపై టీమ్ఇండియా ఈ స్కోర్ సాధించింది. ఇదే భారత్​ హైయ్యెస్ట్ స్కోర్
  • టీమ్ఇండియా అత్యల్ప స్కోరు 158-10 (30.3 ఓవర్లు). 2017 ఎడిషన్ ఫైనల్​లో పాకిస్థాన్​పై భారత్ అత్యల్ప స్కోర్ నమోదు చేసింది
  • 2017లో పాకిస్థాన్​ (గ్రూప్ స్టేజ్)పై భారత్ 158 పరుగుల తేడాతో నెగ్గింది. పరుగుల పరంగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్​కు ఇదే అతి పెద్ద విజయం
  • అదే 2017 ఎడిషన్​లో బంగ్లాదేశ్​పై టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో నెగ్గింది. వికెట్ల పరంగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్​కు ఇదే అతి పెద్ద విజయం
  • ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా శిఖర్ ధావన్ టాప్​లో ఉన్నాడు. ధావన్ 10 మ్యాచ్​ల్లో 701 పరుగులు చేశాడు
  • అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పేరిట ఉంది. 2000లో గంగూలీ సౌతాఫ్రికాపై 141* పరుగులు బాదాడు. ఎక్కువ సిక్స్​లు బాదింది కూడా గంగూలీనే. అతడు 17 సిక్స్​లతో టాప్​లో ఉన్నాడు
  • ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్​గా రవీంద్ర జడేజా టాప్​లో కొనసాగుతున్నాడు. జడ్డూ ఇప్పటివరకు 16 వికెట్లు నేలకూల్చాడు
  • ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్లుగా ధావన్, గంగూలీ ఉన్నారు. ఈ ఇద్దరూ చెరో 3 సెంచరీలు బాదారు
  • కెప్టెన్​గా ఎక్కువ మ్యాచ్​లు నెగ్గిన రికార్డ్​ కూడా గంగూలీ పేరిటే ఉంది. గంగూలీ 11మ్యాచ్​ల్లో టీమ్ఇండియాకు సారథ్యం వహించగా, 7సార్లు విజయం సాధించాడు

ఇక ఈసారి మూడో టైటిల్ వేటిలో రోహిత్ సేన బరిలో దిగనుంది. గ్రూప్ స్టేజ్​లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ (ఫిబ్రవరి 23), న్యూజిలాండ్ (మార్చి 02)ను ఢీకొట్టనుంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో భారత్ తమ మ్యాచ్​లన్నీ తటస్థ వేదిక దుబాయ్​లో ఆడనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ : ఎవరి బలం ఎంత?- ఎవరి ఛాన్స్​లు ఎలా ఉన్నాయి?

ఛాంపియన్స్ ట్రోఫీలో హైయ్యెస్ట్ రన్స్ బాదిన బ్యాటర్స్ - రోహిత్, విరాట్ ఏ ప్లేస్​లో ఉన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.