ETV Bharat / offbeat

రెగ్యులర్​ దోశ తిని బోర్​ కొట్టిందా? - ఇలా "పంచరత్న దోశ" ట్రై చేయండి - సూపర్​గా ఉంటుంది! - HOW TO MAKE PANCHARATNA DOSA

బ్రేక్​ఫాస్ట్​గా దోశ తినాలనిపిస్తుందా? ఇలా 5 పప్పులతో కలిపి దోశ చేసుకోండి అద్దిరిపోతుంది!

How to Make Pancharatna Dosa
How to Make Pancharatna Dosa (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2025, 12:08 PM IST

How to Make Pancharatna Dosa at Home: దోశ - మెజార్టీ పీపుల్​ మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​గా తింటుంటారు. కేవలం మార్నింగ్​ మాత్రమే కాకుండా బయటికి వెళ్లినప్పుడు, నైట్​ డిన్నర్​లో కూడా దీనిని తింటుంటారు. ఇక దోశలో ప్లెయిన్​, మసాలా, ఆనియన్​, రవ్వ అంటూ ఎన్నో రకాలు ఉంటాయి. వీటన్నింటిని ఎప్పుడో ఒకసారి తినే ఉంటారు. మరి మీరు ఎప్పుడైనా పంచరత్న దోశ తిన్నారా? ఎప్పుడూ తినకపోతే ఓసారి ట్రై చేయండి. టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. పైగా ప్రిపేర్​ చేసుకోవడం కూడా వెరీ ఈజీ. మరి లేట్​ చేయకుండా ఈ దోశ ప్రిపేర్​ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

  • మినపప్పు - పావు కప్పు
  • పచ్చి శనగపప్పు - అర కప్పు
  • కందిపప్పు - అర కప్పు
  • పెసర్లు - అర కప్పు
  • ఎర్ర కందిపప్పు - అర కప్పు
  • బియ్యం - 1 కప్పు
  • మెంతులు - 1 టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర - 1 టీ స్పూన్​

తయారీ విధానం:

  • ఓ గిన్నెలోకి మినపప్పు , మెంతులు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 5 గంటలపాటు నాననివ్వాలి.
  • మరో గిన్నెలోకి పచ్చి శనగపప్పు, పెసర్లు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, బియ్యం వేసి శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి వీటినీ 5 గంటలు నానబెట్టుకోవాలి.
  • మినప్పపు, పప్పులు నానిన తర్వాత మరోసారి కడిగి నీళ్లు లేకుండా మిక్సీ జార్​లో వేసి గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని పూర్తిగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి రాత్రి మొత్తం పులిసేలా పక్కన ఉంచాలి.
  • ఆ మరుసటి రోజు ఉదయం పిండిని మరొక్కసారి బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి మరోసారి కలపాలి.
  • ఇప్పుడు అందులోని పిండిని ఓ గిన్నెలోకి కొద్దిగా తీసుకోవాలి. దోశలు పోసుకోవడానికి సరిపడా ఉంటే సరి. అలాకాకుండా పిండి గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి దోశ పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పాన్​ హీటెక్కిన తర్వాత పిండిని పల్చగా పోసి నూనె అప్లై చేయాలి.
  • ఆపై దోశను రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని కొబ్బరి చట్నీ, అల్లం పచ్చడితో తింటే సూపర్​గా ఉంటుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ పిండితోటే ఆనియన్​, ఎగ్​, మసాలా వంటివి కూడా ట్రై చేయవచ్చు. మరి నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.

పప్పు నానబెట్టడం లేదు, చుక్క నూనె లేదు! - 5 నిమిషాల్లోనే అద్దిరిపోయే "గోధుమ రవ్వ దోశలు"!

నిమిషాల్లోనే సూపర్​ టేస్టీ "టమాటా దోశలు" -​ ఇలా చేస్తే ఔర్​ ఏక్​ ప్లేట్​ అనడం పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.