CM Jagan tributes to YSR వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించిన సీఎం జగన్ - CM Jagan tributes
🎬 Watch Now: Feature Video

CM Jagan tributes to YS Rajasekhara Reddy: ముఖ్యమంత్రి జగన్ ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. మూడు రోజుల వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా మొదటిరోజు ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో.. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కళ్యాణదుర్గం నుంచి హెలికాప్టర్లో నేరుగా ఇడుపులపాయ చేరుకున్న ముఖ్యమంత్రి జగన్.. సాయంత్రం నాలుగు గంటలకు తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. తల్లి విజయమ్మ, సతిమణి భారతి, ఎంపీ అవినాష్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రార్థనలో పాల్గొన్నారు.
అనంతరం ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అక్కడ గెస్ట్ హౌస్‌లో సింహాద్రిపురం మండల నాయకులతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. మండలంలో వైసీపీ పరిస్థితి.. అక్కడ బలోపేతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. దీంతోపాటు మండలంలో చేయాల్సి ఉన్న.. అభివృద్ధి పనులపై ముఖ్య నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, అంజాద్ భాషాకాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాత్రికి ఇడుపులపాయలోనే సీఎం జగన్ బస చేయనున్నారు.