CJI Chandrachud Visits Shirdi Saibaba Temple: శిరిడీ సాయిబాబా సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ - shirdi sai baba temple news
🎬 Watch Now: Feature Video
Published : Sep 17, 2023, 5:03 PM IST
CJI Chandrachud Visits Shirdi Saibaba Temple: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ శిరిడీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ముందుగా పంఢరీపూర్‌లో సాయిబాబా పాదాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సాయిబాబా ఆలయానికి వెళ్లి బాబాను దర్శించుకున్నారు. పాదాల వద్ద సాయిబాబా సమాధిపై కాషాయ శాలువా కప్పారు. ఈ సందర్భంగా శిరిడీ కమిటీ సీజేఐని ఆలయ మర్యాదలతో శాలువాలు కప్పి ఘనంగా సత్కరించింది. శిరిడీ సాయి దర్శనం అనంతరం బాబా ద్వారకామాయి ఆలయాన్ని సీజేఐ సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ అడ్హాక్ కమిటీ ఛైర్మన్, జిల్లా సెషన్స్ జడ్జి సుధాకర్ యార్లగడ్డ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివశంకర్, అతుల్ కు-హేకర్( సెక్రటరీ జనరల్), రిజిస్ట్రార్, సుప్రీంకోర్టు రాజేశ్ కుమార్, బొంబాయి హైకోర్టు ఆర్ ఎన్ జోషి, రిజిస్టార్ జనరల్, అనూజా అరోరా తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా దర్శనానంతరం సీజేఐ తన అభిప్రాయాన్ని సాయిబాబా సంస్థాన్ వ్యాఖ్యాన పుస్తకంలో నమోదు చేశారు.