BSNL Launches Two New Prepaid Plans: BSNL యూజర్లకు గుడ్‌న్యూస్. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. ప్రైవేటు కంపెనీలన్నీ టారీఫ్ ధరలను పెంచేసిన వేళ కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ గత కొన్ని నెలలుగా తక్కువ ధరతో సరికొత్త ప్లాన్లను లాంఛ్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా రూ. 628, రూ. 215 ధరతో మరో రెండు ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ ప్లాన్లతో యూజర్లకు డేటా అండ్ యాక్టివ్ వ్యాలిడిటీ, వాయిస్ కాలింగ్ ఫెసిలిటీతో పాటు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ల బెనిఫిట్స్ ఇవే!:
BSNL రూ.628 ప్లాన్: BSNL రూ.628 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో యూజర్లకు 84 రోజుల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, డైలీ 100 SMS, రోజూ 3GB డేటా లభిస్తాయి. అంతేకాక కంపెనీ ఈ ప్లాన్‌తో హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమన్ అండ్ ఆస్ట్రోసెల్ వంటి ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇవి మాత్రమే కాకుండా 'Lystn Podcast', 'Zing Music', 'Wow Entertainment'తో పాటు 'BSNL Tunes'ను కూడా పొందొచ్చు.
BSNL రూ.215 ప్లాన్: BSNL తీసుకొచ్చిన ఈ కొత్త రూ.215 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 2GB ఇంటర్నెట్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు డైలీ 100 SMSలు లభిస్తాయి. వీటితో పాటు ఈ ప్లాన్‌తో హార్డీ గేమ్స్, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమన్ అండ్ ఆస్ట్రోసెల్ ప్రయోజనాలను కూడా పొందొచ్చు. అంతేకాక ఈ రీఛార్జ్ ప్లాన్ చేసుకున్నవారు కూడా 'Lystn Podcast', 'Zing Music', 'Wow Entertainment', 'BSNL Tunes'ను సద్వినియోగం చేసుకోవచ్చు.
మన దేశంలో మూడు పెద్ద ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా జూలై 2024లో తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచేశాయి. దీంతో BSNL ఇది తనకు ఒక గొప్ప అవకాశంగా భావించింది. అప్పటి నుంచి తన నెట్‌వర్క్‌ను మరింత మెరుగుపరిచే దిశగా ప్రయత్నాలను తీవ్రతరం చేయడమే కాకుండా కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక రీఛార్జ్ ప్లాన్‌లను వరుస పెట్టి ప్రారంభించింది. వీటి ధర జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా కంటే చాలా తక్కువ. దీంతో తక్కువ ధరలోనే రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్న వినియోగదారులకు BSNL ఓ ప్రత్యామ్నాయంగా మారింది. గత కొద్ది నెలల్లో చాలా రాష్ట్రాల నుంచి వందలాది మంది యూజర్లు ఈ కంపెనీలను వదిలి నంబర్ పోర్టబిలిటీ ద్వారా BSNLకి కనెక్ట్ అయ్యారు.
ఈ న్యూ ఇయర్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలా? అయితే కాస్త ఆగండి.. త్వరలో కొత్త మోడల్స్ ఎంట్రీ!
హైబ్రిడ్ ఇంజిన్, కొత్త డిజైన్‌తో.. కియా సెల్టోస్ వచ్చేస్తోంది!- రిలీజ్ ఎప్పుడంటే?
నో సబ్స్క్రిప్షన్: 'యాపిల్ TV+'లో ఫ్రీ స్ట్రీమింగ్- న్యూఇయర్ ఆఫర్ అదిరిందిగా!