Sankranthi Festival Special Trains : సంక్రాంతి పండుగ రద్దీని తగ్గట్టుగా ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ఈసారి పండుగ కోసం ఇప్పటికే 112 ప్రత్యేక రైళ్లను సిద్ధం చేసిన రైల్వే శాఖ వాటికి అదనంగా మరో 60 రైళ్లు నడపాలని నిర్ణయించింది. ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లకు అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో (చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్) శ్రీధర్ తెలిపారు. వీటితో పాటు మరో 90 పాసింగ్ త్రూ రైళ్లను కూడా నడిపిస్తున్నామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రత్యేక రైళ్లు, ప్రయాణికుల రద్దీ, రైళ్ల ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ 'ఈటీవీ భారత్'కు వివరించారు.
ఈసారి భారీ స్థాయిలో : సీపీఆర్వో అధికారి మాట్లాడుతూ గతేడాది సంక్రాంతికి 70 ప్రత్యేక రైళ్లను రన్ చేసినట్లు వివరించారు. అదే తీరుగా ఈసారి పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 160 నుంచి 170 రైళ్లను కేవలం దక్షిణ మధ్య రైల్వే నడపడం కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది భారీ స్థాయిలో స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు తెలిపారు.
"ఈ ప్రత్యేక రైళ్లలో అదనపు బోగీలను జోడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. తెలంగాణలో ముఖ్యమైన స్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, ఆంధ్రలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి స్టేషన్లలో ఎక్కువ రద్దీ ఉండేందుకు ఆస్కారముంటుంది. కాబట్టి ప్రయాణికుల భద్రత కోసం రైల్వే పోలీసులు భద్రత కల్పిస్తారు. ట్రాఫిక్ ఫ్లోను కూడా వీరు నియంత్రిస్తారు". - శ్రీధర్, సీపీఆర్వో, దక్షిణ మధ్య రైల్వే
అదనపు ఛార్జీలు : ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు సాధరణ రైళ్లతో పోలిస్తే అదనంగా ఉంటాయని తెలిపారు. స్పెషల్ ట్రైన్స్ అనేవి అదనపు రద్దీ కొరకే నడుపుతున్నందున కొద్ది మొత్తంలోనే అదనపు ఛార్జీలుంటాయని స్పష్టం చేశారు. ప్రత్యేక రైళ్లు కూడా ఎక్స్‌ప్రెస్ రైళ్లలానే ఒకే మార్గంలో ప్రయాణిస్తాయని సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
మరో తొమ్మిది రైళ్లలో అదనపు జనరల్ బోగీలు - ఆ రూట్లలో నడిచే ట్రైన్స్‌కు ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు
ప్రయాణికులకు విజ్ఞప్తి : జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు