ETV Bharat / state

ఎక్కడ పడితే అక్కడ 'వాటర్' తాగుతున్నారా? - అయితే రోగాలు కొనితెచ్చుకున్నట్లే! - REPORT ON UNDERGROUND WATERS

ప్రమాదకరంగా భూగర్భ జలాలు - నైట్రేట్‌ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో 4, ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 5వ స్థానంలో తెలంగాణ - భూగర్భ జలాల నాణ్యత నివేదిక వెల్లడి

Report On Underground Waters
Report On Underground Waters In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2025, 2:07 PM IST

Report On Underground Waters In Telangana : నీరే కదా అని ఎక్కడ పడితే అక్కడ నీరు తాగుతున్నారా? అయితే మీరు రోగాలు కొని తెచ్చుకున్నట్లేనని ప్రయోగశాలల పరీక్షల ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. అదేంటి? నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది తెలుసుకోండి. తాజాగా వార్షిక భూగర్భ జలాల నాణ్యత నివేదిక-2024 పేరుతో కేంద్ర భూగర్భ జలమండలి తాగు నీటిలో ఉన్న రసాయన అవశేషాల గురించి నివేదిక ఇచ్చింది.

విషపూరిత రసాయనాలు పరిమితికి మించి : దేశవ్యాప్తంగా 2023లో నైరుతి రుతుపవనాలు రావడానికి ముందు, అవి వచ్చి వర్షాలు కురిసిన తర్వాత రెండు దఫాలుగా భూగర్భ జలాల నుంచి నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించారు. ఒక్కో అంశానికి సంబంధించి విడివిడిగా నమూనాలను తీసుకున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లో విషపూరిత రసాయన అవశేషాలు పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలోని కొన్ని జిల్లాలో ఈ తీవ్రత ఎక్కువదా ఉందని కేంద్ర భూగర్భ జలమండలి విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది.

ఫ్లోరోసిస్‌ సహా అనేక రకాల వ్యాధులు : లీటరు నీటిలో 1.5 మిల్లీ గ్రాములకు మించి ఫ్లోరైడ్, 45 మి.గ్రా.కు మించి నైట్రేట్‌ ఉంటే పరిమితికి మించి ఉన్నట్లుగా భావిస్తారు. ఆ నీరు తాగడానికి పనికిరాదు. ఇలాంటి నీరును తాగితే ప్రజలు ఫ్లోరోసిస్​ బారిన పడతారు.

5వ స్థానంలో తెలంగాణ : భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్‌ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో 5వ స్థానంలో తెలంగాణ ఉంది. 2023లో రుతుపవనాల అనంతరం 1,150 నీటి నమూనాలను పరీక్షించారు. దీంట్లో 171 నమూనాల్లో ఫ్లోరైడ్‌ పరిమితికి మించి ఉన్నట్లు తెలిపింది. ఇలా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో హరియాణా, కర్ణాటక, దిల్లీ, రాజస్థాన్, ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది.

క్లోరైడ్‌ కూడా ఎక్కువే : లీటరు తాగునీటిలో 250 మి.గ్రాములలోపు క్లోరైడ్‌ ఉంటే అవి సురక్షితమని అర్థం. కానీ తెలంగాణలో 1,150 నీటి నమూనాలను పరిక్షిస్తే 143లో అంతకు మించి క్లోరైడ్‌ ఉన్నట్లు తెలిసింది. 1,000 మి.గ్రా.లకు మించి క్లోరైడ్‌ ఉంటే పొరపాటున కూడా ఆ నీటిని తాగకూడదు. కానీ తెలంగాణలో 6 నమూనాల్లో అంతకుమించి ఉన్నట్లు తెలిపారు.

1.ఫ్లోరైడ్‌ పరిమితికి మించి

  • జిల్లాలవారీగా చూస్తే దేశంలో 5వ స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫ్లోరైడ్‌ ఉంది. ఇక్కడ సేకరించిన 43 నీటి నమూనాలను పరీక్షిస్తే 21 నమూనాల్లో ఫ్లోరైడ్‌ పరిమితికి మించి ఉన్నట్లు గుర్తించారు. యాదాద్రి కన్నా ముందు స్థానాల్లో రాజస్థాన్‌లోని నగౌర్, జోధ్‌పుర్, హరియాణాలోని జింద్, సోనిపట్‌ జిల్లాలున్నాయి.
  • జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్‌ తప్ప మిగిలిన 28 జిల్లాల్లో ఫ్లోరైడ్‌ పరిమితికి మించి ఉన్నట్లు తేలింది.

2. నైట్రేట్‌ పరిమితికి మించి

  • తెలంగాణలో రుతుపవనాల తర్వాత 1,140 నీటి నమూనాలను పరీక్షిస్తే 316లో నైట్రేట్‌ పరిమితికి మించి ఉంది. ఇలా ఎక్కువ నమూనాల్లో నైట్రేట్‌ ఉన్న రాష్ట్రాల్లో 4వ స్థానంలో తెలంగాణ ఉంది. 1వ స్థానంలో మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు ఉన్నాయి.
  • దేశంలో నైట్రేట్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలలో 3వ స్థానంలో రంగారెడ్డి, 12 స్థానాల్లో ఆదిలాబాద్, 13వ స్థానంలో సిద్దిపేట ఉన్నాయి.
  • రంగారెడ్డి జిల్లాలో 70 నీటి నమూనాలను పరీక్షిస్తే 44, ఆదిలాబాద్‌లో 51కి 24, సిద్దిపేటలో 51కి 24 నమూనాల్లో నైట్రేట్‌ పరిమితికి మించి ప్రమాదకర స్థాయిలో ఉంది.
  • హైదరాబాద్‌ తప్ప మిగిలిన 32 జిల్లాల్లో నైట్రేట్‌ పరిమితికి ఉందని వెల్లడించారు.

3.ఆర్సెనిక్‌ అనే రసాయనం

  • నల్గొండ జిల్లా నీటి నమూనాల్లో ఆర్సెనిక్‌ అనే రసాయనం పరిమితికి మించి ఉండం వల్ల చర్మవ్యాధులు అధికంగా వస్తాయి. ఇది లీటరు నీటిలో 0.01 మిల్లీగ్రాముకు మించి ఉంటే తాగకూడదని తెలిపింది. కానీ నల్గొండలో సేకరించిన నీటి నమూనా పరీక్షల్లో అంతకన్నా ఎక్కువగా ఉంది.
  • తెలంగాణలో వ్యవసాయానికి వాడుతున్న భూగర్భ జలాల 10.35 శాతం నమూనాల్లో ప్రమాదకరమైన రసాయనాలున్నందున సాగుకు వాడకూడదు.
  • రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, సంగారెడ్డి, తప్ప మిగిలిన 27 జిల్లాల్లో తీసుకున్న నీటి నమూనాల్లో వ్యవసాయానికి వాడుతున్న సాగునీరు సురక్షితం కాదని తేలింది. భూగర్భ జలాల్లో లీటరు నీటిలో 1.25 మి.గ్రాములకు మించి సోడియం కార్బొనేట్‌ ఉంటే పంటల సాగుకు వాడకూడదని నిపుణులు తెలిపారు.

ఇళ్లు, భవనాల్లో ఇంకుడు గుంత తప్పనిసరి - ప్రభుత్వం కొత్త గైడ్​లైన్స్ మీరూ తెలుసుకోండి

కల్తీనీటిని ప్రముఖ బ్రాండ్ల పేరుతో తయారు చేసి విక్రయం - ఎట్టకేలకు అధికారుల దాడులతో బట్టబయలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.