Balotsav Children Cultural society Telugu Language Development Program : మాతృభాషపై పట్టు ఉంటే ఏ భాష అయినా సులభంగా నేర్చుకోవచ్చు. అలాంటి వారు చదువుల్లోనూ బాగా రాణిస్తారు. నేటి స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో చాలా మంది తెలుగు భాష మాధుర్యానికి దూరంగా వెళ్తున్నారని సర్వేల్లో తేలుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలకు కథ, కవితా రచనపై ఆసక్తిని కలిగిస్తే నెమ్మదిగా భాషపై మమకారం, చదివేందుకు ఆసక్తి పెరుగుతుందని కవులు, భాషా వేత్తలు పేర్కొంటున్నారు. చిన్నతనంలో తెలుగు భాషపై పట్టు సాధించే వారు చదువుల్లోనూ బాగా రాణించగలుగుతున్నారు. అయితే బాలలు కథలు, కవితలు ఎలా రాయాలో మెలకువలు నేర్పేందుకు ఓ సంస్థ కార్యశాల నిర్వహిస్తోంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
విద్యార్థులకు ప్రశంసాపత్రాలు : తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కవులు, కథకులు కరుణ తాయమ్మ, పుప్పాల కృష్ణమూర్తి, దేశారాజు, తోట సుభాషిణి, వరదయ్య, చిట్టి మధుసూదన్ రావు, భగవంతం, శ్రీనివాస్‌గౌడ్, శీరంశెట్టి కాంతారావు, మండవ సుబ్బారావు తదితరులు హాజరై పిల్లలకు మెలుకువలు నేర్పిస్తారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు.
పిల్లలు నడుపుతున్న 'స్కూల్ బ్యాంకు' - అక్కడ విద్యార్థులే ఉద్యోగులు - ఎక్కడంటే?
పూర్తి వివరాలు | |
అంశం | 'కథ, కవిత, రచన' కార్యశాల |
తేదీలు | జనవరి 3, 4 ఉదయం 10 గంటల నుంచి |
వేదిక | కొత్తగూడెం క్లబ్ |
నిర్వహణ సంస్థ | ‘బాలోత్సవ్ చిల్డ్రన్స్ కల్చరల్ సొసైటీ’ |
ఎవరెవరికి?: | 8, 9, 10 తరగతి చదివే విద్యార్థులకు |
పరిమితి | ప్రతి పాఠశాలలో తరగతికి ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు |
వసతులు | విద్యార్థులందరికీ ఉచిత భోజన సదుపాయం |
విన్నపం : కార్యశాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని జాతీయ బాలోత్సవ్ కన్వీనర్ డా.వాసిరెడ్డి రమేష్ కోరారు.
బాలికలదే పై చేయి : విద్యాస్థితి-2023 నివేదికలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సగం మందికి పైగా విద్యార్థులు తెలుగును స్పష్టంగా చదవలేకపోతున్నారని వెల్లడైంది. 14-16 వయసున్న విద్యార్థుల్లో 42.2 శాతం, 17-18 వయస్కుల్లో 50.3 శాతం మంది మాత్రమే రెండో తరగతి స్థాయి పాఠ్యాంశాలను చూసి చదవగలిగారు. మిగితవారు చదువుతున్నప్పుడు తడబడ్డారు. కాగా తెలుగుపై బాలురు కంటే బాలికలకు పట్టు ఉన్నట్లు సర్వే తేల్చింది. ఈ క్రమంలో ప్రాథమిక స్థాయి తరగతుల నుంచి కథలు, కవితలు, రచనలు రాయడం ద్వారా భాషపై ఆసక్తి పెంచేలా చేస్తే సత్ఫలితాలుంటాయని భాషా వేత్తలు అంటున్నారు.
పిల్లల్లో ఏకాగ్రత పెంచాలంటే ఏం చేయాలి? - అమెరికా పరిశోధకులు చెప్పిన విషయాలివే
ఎంత చదివినా అస్సలు గుర్తుండటం లేదా? - ఇలా చదివితే క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ మీదే!