Can Diabetes Medicines Cause Gas Problems : డయాబెటిస్ మందులు వాడితే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయా..? నిజమెంత?
🎬 Watch Now: Feature Video
Can Diabetes Medicines Cause Gas Problems : దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడేవారు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తల్లో షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం. దీంతో పాటు HBA1C లాంటి పరీక్షలను ప్రతి మూడు నెలలకోసారి చెయించుకోవాలి. అయితే HBA1C లెవెల్ అనేది 7 లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ఆహారం తినడంలో నియంత్రణ పాటించడం, రోజూ వ్యాయామాలు చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించడం, యోగా చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇలా తరచూ చేయించుకునే పలు రకాల టెస్టుల వల్ల మన శరీరంలో ఏమైనా అవయవాలు దెబ్బతిన్నాయా లేదా అనేది సులువుగా తెలుసుకోవచ్చు. కళ్లకు చేసే ఫండస్ పరీక్ష.. రెటీనా ఏమైనా డ్యామేజ్ అయిందా అనే విషయాన్ని తెలియజేస్తుంది. గుండెకు సంబంధించిన డ్యామేజీని అంచనా వేయడానికి ట్రెడ్మిల్ పరీక్ష, కిడ్నీకి సంబంధించి సీరమ్ క్రియాటినిన్, రక్తనాళాలకు సంబంధించి ఇతర పరీక్షలు ఇలా అవసరాన్ని బట్టి ప్రతి ఆరునెలలకోసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది. వీటితో పాటు దీర్ఘకాల షుగర్ వ్యాధిగ్రస్తులు తమ శరీరంలో రోగనిరధక శక్తి తగ్గిందని అనిపిస్తే వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల వ్యాక్సిన్లను తీసుకుంటే మంచిది. అయితే షుగర్‌కు వాడే మందుల వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయా? షుగర్ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వస్తాయో లేదో తెలుసుకోవడం కోసం ఈ పూర్తి వీడియో చూసేయండి.