బైక్​కు అంత్యక్రియలు! చలాన్లపై బిహార్​ వ్యక్తి వినూత్న నిరసన - బిహార్ బైక్​కు అంత్యక్రియలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 21, 2023, 4:02 PM IST

మనుషులకు అంత్యక్రియలు చేయడం సాధారణమే. ఇష్టంగా పెంచుకున్న జంతువులకు సైతం కొంత మంది అంత్యక్రియలు చేస్తుంటారు. కానీ బిహార్​ పట్నాకు చెందిన ఓ వ్యక్తి బైక్​కు అంత్యక్రియలు నిర్వహించి వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టాడు. ప్రభుత్వం విధించిన నిబంధనలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేశాడు సామాజిక కార్యకర్త కృష్ణ కుమార్​. అంత్యక్రియలకు సిద్ధం చేసినట్లుగా బైక్​కు పూలమాలలు వేసి, చుట్టూ కర్రలు నిలబెట్టాడు కృష్ణకుమార్. అయితే, బైక్​కు మంటలు అంటించకుండా.. పక్కనే ఉంచిన కర్రలకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశాడు.

పోలీసులు రోజుకు నాలుగు సార్లు చలాన్​ విధిస్తున్నారని ఆరోపించాడు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించాడు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ నిబంధనలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ నిబంధనను సవరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ బైక్ అంత్యక్రియల్లో అనేక మంది బాధితులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

"సీఎం నీతీశ్ కుమార్​ వెంటనే ఈ నిబంధనను సవరించాలి. పట్నాలోని అనేక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి చలాన్లు విధిస్తున్నారు. హెల్మెట్​ లేకపోయినా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా.. రోజుకు నాలుగు సార్లు చలాన్ విధించి రూ.4వేలు జరిమానా వేశారు. ఇలా చలాన్లు వేసి ప్రజలను ఇబ్బందులు పెడుతోంది ప్రభుత్వం. అందుకే నా బైక్​కు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆత్మహత్య చేసుకుంటాను" అని కృష్ణకుమార్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.