ETV Bharat / offbeat

మహా కుంభమేళాకు వెళ్తారా? - హైదరాబాద్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! - IRCTC MAHA KUMBH PUNYA KSHETRA TOUR

- వారణాసి, అయోధ్య కూడా దర్శించుకోవచ్చు - తక్కువ ధరకే 8 రోజుల టూర్​

IRCTC Maha Kumbh Punya Kshetra Yatra
IRCTC Maha Kumbh Punya Kshetra Yatra (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2025, 3:26 PM IST

IRCTC Maha Kumbh Punya Kshetra Yatra: ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమవుతోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు ఈ మేళా జరగనుంది. కుంభమేళా సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు.

అందుకే.. కోట్ల సంఖ్యలో భక్తులు పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడానికి వస్తుంటారు. మరి మీరు కూడా మహా కుంభమేళాకు వెళ్దామనుకుంటున్నారా? అయితే.. మీకు ఇండియన్​ రైల్వే క్యాటరింగ్ అండ్​​ టూరిజం కార్పొరేషన్​ గుడ్​న్యూస్​ చెబుతోంది. భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ద్వారా కుంభమేళాకు ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి, ఈ యాత్ర ఎప్పుడు మొదలవుతుంది? ధర ఎంత? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

IRCTC టూరిజం "మహా కుంభ పుణ్యక్షేత్ర యాత్ర" పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. ఈ టూర్​ హైదరాబాద్‌ నుంచి మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్​, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, తుని, దువ్వాడ, విజయనగరం స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. టూర్​ పూర్తి అయిన​ తర్వాత తిరిగి ఆయా స్టేషన్లలో దిగొచ్చు. మహాకుంభమేళాతో పాటు వారణాసి, అయోధ్య కూడా దర్శించుకోవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్​ ప్రారంభమవుతుంది. కాజీపేట, వరంగల్​, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రిలో రైలు ఎక్కొచ్చు.
  • రెండో రోజు తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణించి మూడో రోజు మధ్యాహ్నానికి వారణాసి చేరుకుంటారు.
  • అక్కడి నుంచి హోటల్​కు వెళ్లి అక్కడ చెకిన్ ప్రాసెస్​ పూర్తి చేస్తారు. సాయంత్రం వారణాసిలో గంగా హారతి వీక్షించి.. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత ప్రయాగరాజ్​ బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత లంచ్​ ఉంటుంది. లంచ్​ అనంతరం కుంభమేళాకు వెళ్తారు. ఆ రోజంతా అక్కడే ఉండి ఆ రాత్రికి ప్రయాగరాజ్​లోని టెంట్​ సిటీలో స్టే చేస్తారు.
  • ఐదో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత వారణాసి బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత కాశీ విశ్వనాథ్​, కాశీ విశాలక్ష్మీ, అన్నపూర్ణ దేవి ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రాత్రికి అక్కడే డిన్నర్​ చేసి స్టే చేస్తారు.
  • ఆరో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి అయోధ్యకు బయలుదేరుతారు. అక్కడ శ్రీరామ జన్మభూమి, హనుమాన్​ ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రాత్రికి అయోధ్య నుంచి హైదరాబాద్​కు తిరుగు ప్రయాణమవుతారు. ఆ రాత్రి ప్రయాణం ఉంటుంది.
  • ఏడో రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • ఎనిమిదో రోజు విజయనగరం, దువ్వాడ, తుని, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగల్​, కాజీపేట మీదుగా సికింద్రాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ప్యాకేజీ ఛార్జీలు:

  • ఎకానమీ(SL) క్లాస్‌లో పెద్దలకు రూ. 22,635, 5 నుంచి 11 సంవ్సతరాల చిన్నారులకు రూ.21,740గా ధర నిర్ణయించారు.
  • స్టాండర్డ్​(3AC)లో పెద్దలకు రూ.31,145, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.30,095 గా నిర్ణయించారు.
  • కంఫర్ట్‌(2AC)లో పెద్దలకు రూ.38,195, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.36,935 చెల్లించాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • సెలక్ట్​ చేసుకున్న ప్యాకేజీని బట్టి రైళ్లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ క్లాసులో ప్రయాణం
  • హోటల్​ అకామడేషన్​
  • ప్యాకేజీని బట్టి ప్రయాణానికి వెహికల్​
  • ఉదయం కాఫీ, బ్రేక్​ఫాస్ట్​, లంచ్​, డిన్నర్​
  • ప్రయాణికులకు ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్యాకేజీలో లేని ప్రదేశాలను సందర్శించాలన్నా, గైడ్‌ని నియమించుకోవాలన్నా యాత్రికులే చూసుకోవాలి.
  • ఈ యాత్ర జనవరి 20వ తేదీన​ ప్రారంభమవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీని బుక్​ చేసుకునేందుకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

కొత్త సంవత్సరంలో జ్యోతిర్లింగాలు దర్శించుకుంటారా? - తక్కువ ధరకే IRCTC ప్యాకేజీ - ఈ ప్రదేశాలూ చూడొచ్చు!

IRCTC "గోల్డెన్​ సాండ్స్​ ఆఫ్​ రాజస్థాన్​" - అందుబాటు ధరలోనే ఆరు రోజుల ప్యాకేజీ - ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.